Joe Biden: రేసు నుంచి జో బైడెన్ ఔట్.! అధ్యక్ష ఎన్నికల అభ్యర్థిగా కమలా హారిస్.?
అమెరికా అధ్యక్ష ఎన్నికల బరి నుంచి వైదొలగాలని అధ్యక్షుడు జో బైడెన్ తీవ్రంగా ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఒకవైపు సొంత పార్టీ నేతల నుంచి వ్యతిరేకత, మరోవైపు ఆరోగ్య సమస్యలు ఉన్న నేపథ్యంలో బైడెన్ అధ్యక్ష ఎన్నికల రేసులో కొనసాగడంపై ఆత్మ శోధన చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ వారాంతంలోపే దీనిపై బైడెన్ కీలక ప్రకటన చేయనున్నట్లు అమెరికా మీడియాలో కథనాలు వస్తున్నాయి.
అమెరికా అధ్యక్ష ఎన్నికల బరి నుంచి వైదొలగాలని అధ్యక్షుడు జో బైడెన్ తీవ్రంగా ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఒకవైపు సొంత పార్టీ నేతల నుంచి వ్యతిరేకత, మరోవైపు ఆరోగ్య సమస్యలు ఉన్న నేపథ్యంలో బైడెన్ అధ్యక్ష ఎన్నికల రేసులో కొనసాగడంపై ఆత్మ శోధన చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ వారాంతంలోపే దీనిపై బైడెన్ కీలక ప్రకటన చేయనున్నట్లు అమెరికా మీడియాలో కథనాలు వస్తున్నాయి. అమెరికా అధ్యక్ష రేసు నుంచి అధ్యక్షుడు జో బైడెన్ వైదొలగాలని సర్వత్రా డిమాండ్లు వినిపిస్తున్నాయి. అక్కడి మీడియా కథనాలు కూడా ఇదే విషయాన్ని కోడై కూస్తున్నాయి. అటు సొంత పార్టీ నేతల నుంచే బైడెన్‌కు నానాటీకి వ్యతిరేకత పెరుగుతోంది. ఇటీవల మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా సైతం ఆయన అభ్యర్థిత్వంపై ఆందోళన వ్యక్తం చేశారు.
నవంబరులో జరిగే ఎన్నికల్లో తాను గెలిచే అవకాశాలు లేవనే వాస్తవాన్ని బైడెన్ అంగీకరించినట్లుగా ఆయన సన్నిహితులు వెల్లడించినట్లు న్యూయార్క్ టైమ్స్ తన కథనంలో పేర్కొంది. మరోవైపు అమెరికా అధ్యక్ష ఎన్నికల బరి నుంచి బైడెన్ వైదొలగాలని మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు అక్కడి మీడియా కథనాలు పేర్కొన్నాయి. డెమొక్రటిక్ పార్టీ సీనియర్ నేత, మాజీ హౌస్ స్పీకర్ నాన్సీ పెలోసీ కూడా బైడెన్‌పై నేరుగా అసంతృప్తి వ్యక్తం చేసినట్లు అమెరికా పత్రికల్లో కథనాలు వస్తున్నాయి. ఇటీవల కొవిడ్ బారిన పడిన బైడెన్ ప్రస్తుతం డెలావర్‌లోని తన ఇంట్లో క్వారంటైన్‌లో ఉన్నారు. తాను తీవ్ర అనారోగ్యానికి గురైతే అధ్యక్ష రేసు నుంచి వైదొలగడంపై ఆలోచిస్తానని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో బైడెన్ చెప్పారు. ఈ తరుణంలో కొవిడ్ నుంచి కోలుకున్న తర్వాత ఈ వారాంతంలో అధ్యక్ష ఎన్నికల్లో నిలిచేదీ లేదా తప్పుకునేది అధికారికంగా ప్రకటించే అవకాశామున్నట్లు తెలుస్తోంది. ఆయన స్థానంలో ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ను డెమొక్రాట్ల అధ్యక్ష అభ్యర్థిగా ప్రకటించనున్నట్లు సమాచారం.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.