Indian plane: ర‌ష్యాలో అత్యవసరంగా ల్యాండ్‌ అయిన భారత్ విమానం.. అదే కారణమా.?

Indian plane: ర‌ష్యాలో అత్యవసరంగా ల్యాండ్‌ అయిన భారత్ విమానం.. అదే కారణమా.?

Anil kumar poka

|

Updated on: Jul 23, 2024 | 9:33 AM

ఢిల్లీ నుంచి శాన్ ఫ్రాన్సిస్‌కో వెళ్తున్న విమానాన్ని అత్యవస‌రంగా ర‌ష్యాకు మళ్లించారు. విమానంలో సాంకేతిక స‌మ‌స్య త‌లెత్తడంతో.. ఆ విమానాన్ని క్రాస్కోయార్క్ ఇంట‌ర్నేష‌న‌ల్ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ చేశారు. ఎయిర్ ఇండియాకు చెందిన ఏఐ 183 విమానంలో 225 మంది ప్రయాణికులు, 19 మంది సిబ్బంది ఉన్నారు. వాస్తవానికి ఉక్రెయిన్‌తో యుద్ధం జ‌రుగుతున్న కార‌ణంగా.. చాలా వ‌ర‌కు విదేశీ విమాన సంస్థలు ర‌ష్యా రూట్‌ను వాడ‌డం లేదు.

ఢిల్లీ నుంచి శాన్ ఫ్రాన్సిస్‌కో వెళ్తున్న విమానాన్ని అత్యవస‌రంగా ర‌ష్యాకు మళ్లించారు. విమానంలో సాంకేతిక స‌మ‌స్య త‌లెత్తడంతో.. ఆ విమానాన్ని క్రాస్కోయార్క్ ఇంట‌ర్నేష‌న‌ల్ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ చేశారు. ఎయిర్ ఇండియాకు చెందిన ఏఐ 183 విమానంలో 225 మంది ప్రయాణికులు, 19 మంది సిబ్బంది ఉన్నారు. వాస్తవానికి ఉక్రెయిన్‌తో యుద్ధం జ‌రుగుతున్న కార‌ణంగా.. చాలా వ‌ర‌కు విదేశీ విమాన సంస్థలు ర‌ష్యా రూట్‌ను వాడ‌డం లేదు. కానీ ఫ్లయింగ్ టైం, కాస్ట్ అడ్వాంటేజ్ కోసం ఎయిర్ ఇండియా మాత్రం ర‌ష్యా రూట్లో విమానాన్ని న‌డిపిస్తోంది.

క్రాస్కోయార్క్ విమానాశ్రయంలో ఉన్న ఎయిర్ ఇండియా ప్రయాణికుల‌ను సుర‌క్షితంగా శాన్ ఫ్రాన్సిస్‌కో చేర్చేందుకు ప్రత్యేక విమానాన్ని పంపుతున్నారు. ముంబై నుంచి రిలీఫ్ ఫ్లయిట్ బ‌య‌లుదేర‌నుంది. రిలీఫ్ ఫ్లయిట్‌కు రెగ్యులేట‌రీ క్లియ‌రెన్స్ అనుమ‌తులు వ‌చ్చిన‌ట్లు ఎయిర్ ఇండియా సంస్థ త‌న ఎక్స్ అకౌంట్‌లో సోస్ట్‌ చేసింది. ర‌ష్యా వీసాలు లేని కార‌ణంగా.. ఎమ‌ర్జెన్సీగా ల్యాండ్ అయిన విమాన ప్రయాణికులకు స‌పోర్టుగా ఉంటున్నట్లు స్థానిక ఎయిర్ ఇండియా అధికారులకు తెలిపారు. మాస్కోలో ఉన్న భార‌తీయ కాన్సలేట్ అధికారులు .. ప్రయాణికుల్ని హోట‌ళ్లకు పంపేందుకు ర‌ష్యా అధికారుల‌తో చ‌ర్చించారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.