China Kills Cats Video: పిల్లుల్ని చంపేస్తున్నా చైనా.. ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు.. మూగజీవాలా ప్రాణంతో ఆటలు..(వీడియో)

చైనాలో కరోనా మహమ్మారి కేసులు తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరుగుతున్నాయి. కరోనాను అదుపులోకి తెచ్చేందుకు అక్కడి ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. ఒకరిద్దరికి పాజిటివ్‌గా తేలినా.. వేల మందికి పరీక్షలు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే...

China Kills Cats Video: పిల్లుల్ని చంపేస్తున్నా చైనా.. ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు.. మూగజీవాలా ప్రాణంతో ఆటలు..(వీడియో)

|

Updated on: Oct 04, 2021 | 9:20 AM

చైనాలో కరోనా మహమ్మారి కేసులు తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరుగుతున్నాయి. కరోనాను అదుపులోకి తెచ్చేందుకు అక్కడి ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. ఒకరిద్దరికి పాజిటివ్‌గా తేలినా.. వేల మందికి పరీక్షలు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఉత్తర చైనాలోని హార్బిన్‌ పట్టణానికి చెందిన మూడు పిల్లులకు పాజిటివ్‌గా తేలడంతో వాటిని అధికారులు చంపేశారు. కరోనా సోకిన జంతువులకు చికిత్స లేకపోవడం.. వాటి ద్వారా యజమానులు, అపార్ట్‌మెంట్‌ వాసులకు ప్రమాదం పొంచి ఉన్న కారణంగా తప్పని పరిస్థితుల్లో వాటిని అధికారులు చంపాల్సి వచ్చిందని చైనా అధికారిక మీడియా వెల్లడించింది.

ఆ పెంపుడు పిల్లుల యజమానురాలికి సెప్టెంబర్‌ 21న వైరస్‌ నిర్ధరణ కాగా, ఆమె ఐసోలేషన్‌లోకెళ్ళింది. ఆమె పెంచుకుంటున్న మూడు పిల్లులకు వైద్యాధికారులు పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా తేలింది. మనుషులకు మాత్రమే సోకే కరోనా వైరస్‌.. అమెరికా వ్యాధి నియంత్రణ, నివారణ కేంద్రం సీడీసీ చెప్పినట్లుగా .. కొన్ని సందర్భాల్లో మానవుల ద్వారా జంతువులకు కూడా కరోనా సోకే అవకాశం ఉంది. అందుకే కరోనా సోకినా, లక్షణాలు బయటపడినా పెంపుడు జంతువులకు దూరంగా ఉండాలని సీడీసీ సూచిస్తోంది.

కొవిడ్‌ నిర్మూలనకు చైనా కఠిన చర్యలు చేపడుతోంది. ఎవరికైనా పాజిటివ్‌గా తేలితే ఆ ప్రాంతం మొత్తంలో లాక్‌డౌన్‌ విధిస్తోంది. ఇళ్ల నుంచి ఎవరూ బయటకు రాకుండా చర్యలు తీసుకుంటోంది. ఆ ప్రాంతంలో వీలైనంత మందికి కొవిడ్‌ టెస్టులు నిర్వహిస్తోంది. వ్యాక్సినేషన్‌ ప్రక్రియను సైతం వేగంగా చేపడుతోంది. 100 కోట్ల మందికి పూర్తిగా వ్యాక్సిన్లు వేసినట్లు రెండు వారాల క్రితమే చైనా ప్రభుత్వం వెల్లడించింది. 
మరిన్ని చదవండి ఇక్కడ : Rohith Sharma: పాకిస్థాన్ లో చిల్ అవుతున్న రోహిత్ శర్మ .. అసలు మ్యాటర్ ఇదేనా..!(వీడియో)

 Leopard attack Viral Video: చిరుతపై వృద్దురాలు ఎటాక్.. వృద్దురాలి దెబ్బ‌కు.. పారిపోయిన చిరుత‌.. వైరల్‌గా మారిన వీడియో..

 Bear Viral Video: కారు డోర్ తీయగానే మహిళకు ఊహించని షాక్.. ఇలా అవుతుందనుకోలే.. వైరల్ అవుతున్న వీడియో..

 MAA Elections 2021 : మంచు విష్ణు కు మద్దతు ప్రకటించిన బాలయ్య.. సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్న వీడియో..

Follow us
కొవ్వు మంచిదే.. ఈ 4 ఆహారాలు శరీరానికి బ్రహ్మాస్త్రాలు..
కొవ్వు మంచిదే.. ఈ 4 ఆహారాలు శరీరానికి బ్రహ్మాస్త్రాలు..
చిన్న సమస్యకే కలత చెందుతున్నారా? మానసికంగా దృఢంగా ఉండాలంటే..
చిన్న సమస్యకే కలత చెందుతున్నారా? మానసికంగా దృఢంగా ఉండాలంటే..
డ్రై స్కిన్ కారణంగా వయసు కన్నా ముందుగానే వృద్ధాప్యం..!
డ్రై స్కిన్ కారణంగా వయసు కన్నా ముందుగానే వృద్ధాప్యం..!
కాంగ్రెస్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ ప్రధాని మోదీ
కాంగ్రెస్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ ప్రధాని మోదీ
రిజర్వేషన్లపై ఆర్ఎస్‌ఎస్ చీఫ్‌ మోహన్‌ భగవత్ కీలక వ్యాఖ్యలు
రిజర్వేషన్లపై ఆర్ఎస్‌ఎస్ చీఫ్‌ మోహన్‌ భగవత్ కీలక వ్యాఖ్యలు
6 అర్థ శతకాలు.. 6సార్లు ఓడిన ముంబై ఇండియన్స్.. తిలక్‌పై ట్రోల్స్
6 అర్థ శతకాలు.. 6సార్లు ఓడిన ముంబై ఇండియన్స్.. తిలక్‌పై ట్రోల్స్
పాటల్లేని విజయ్ సినిమా.. 75 కోట్లు వసూలు చేసిన కేరళలో మూడో సినిమా
పాటల్లేని విజయ్ సినిమా.. 75 కోట్లు వసూలు చేసిన కేరళలో మూడో సినిమా
గతేడాది ఐటీఆర్ దాఖలు చేయని వారికి ఇంకా అవకాశం ఉందా?
గతేడాది ఐటీఆర్ దాఖలు చేయని వారికి ఇంకా అవకాశం ఉందా?
బాబును నమ్మడం అంటే చంద్రముఖిని నిద్రలేపడమే: సీఎం జగన్
బాబును నమ్మడం అంటే చంద్రముఖిని నిద్రలేపడమే: సీఎం జగన్
అణు యుద్ధాన్ని తట్టుకునేలా విమానం.. ప్రత్యేకతలు ఇవే!
అణు యుద్ధాన్ని తట్టుకునేలా విమానం.. ప్రత్యేకతలు ఇవే!