China dam: భూ భ్రమణాన్ని ఆపేసిన డ్యామ్.. ప్రపంచంలోనే అతిపెద్దదైన చైనాలోని త్రీగోర్జెస్ డ్యామ్..
ఓ పెద్ద డ్యామ్ భూ భ్రమణాన్నే ఆపేసింది. చైనాలోని యాంగ్జీ నదిపై ఉన్న త్రీగోర్జెస్ డ్యామ్ ప్రపంచంలోనే అతి పెద్ద డ్యామ్. ఇది 2.33 కిలోమీటర్ల పొడవుతో, 181 మీటర్ల ఎత్తుతో ఉంటుంది.
ఓ పెద్ద డ్యామ్ భూ భ్రమణాన్నే ఆపేసింది. చైనాలోని యాంగ్జీ నదిపై ఉన్న త్రీగోర్జెస్ డ్యామ్ ప్రపంచంలోనే అతి పెద్ద డ్యామ్. ఇది 2.33 కిలోమీటర్ల పొడవుతో, 181 మీటర్ల ఎత్తుతో ఉంటుంది. దీనితో 660 కిలోమీటర్ల పొడవున రిజర్వాయర్ ఏర్పడింది.ఈ రిజర్వాయర్‌లో సముద్ర మట్టంకన్నా సుమారు 175 మీటర్ల ఎత్తున నిలిచిన నీటి బరువు ఏకంగా 39 వేల కోట్ల కిలోలు ఉంటుందని ఓ అంచనా.భారీ డ్యామ్, రిజర్వా యర్‌లో నిలిచే నీటి బరువు ఓవైపు.. డ్యామ్ నుంచి విడుదలయ్యే నీరు 150 మీటర్ల ఎత్తు నుంచి దూకుతుంటే ‘మూమెంట్ ఆఫ్ ఇనెర్షియా’ ప్రభావం ఏర్ప డిందని నాసా శాస్త్రవేత్తలు గుర్తించారు. దీని వల్ల భూమి భ్రమణవేగం అత్యంత స్వల్ప స్థాయిలో తగ్గిందని.. రోజు గడువు కూడా 0.06 మైక్రోసెకన్లు పెరిగిందని తేల్చారు. అంతేకా దు ఈ భారీ డ్యామ్ వల్ల.. భూమి ధ్రువాల స్థానం కూడా రెండు సెంటీమీటర్ల మేర పక్కకు జరిగిందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. వేగంగా, గుండ్రంగా తిరిగే వస్తువు ఏదైనా దానిలోని కణాలన్నీ అన్నివైపులా సమానంగా సర్దుకుంటాయి. దాంతో అన్నివైపులా సమాన బరువు ఏర్పడుతుంది. అలాకాకుండా ఏదో ఒకచోట భారీ బరువు చేరినప్పుడు జడత్వం నెలకొని.. సదరు వస్తువు తిరిగే వేగం తగ్గిపోతుంటుంది. దీనినే ‘మూమెంట్ ఆఫ్ ఇనెర్షియా’ అంటారు. త్రీగోర్జెస్ డ్యామ్ వల్ల భూమిపై ఇలాంటి ప్రభావమే పడి.. భ్రమణ వేగం తగ్గినట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. త్రీగోర్జెస్ డ్యామ్ వల్ల.. ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో భూమి పొరల కదలికలు కూడా ప్రభావితమయ్యాయని, చిన్న స్థాయిలో భూకంపాలు కూడా వస్తున్నాయని శాస్త్రవేత్తలు తేల్చారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Google Search: ఈ 3 విషయాలు గూగుల్‌లో సెర్చ్ చేయకండి.. చేస్తే జైలుకెళ్లడం కన్ఫమ్..!
Ratlam Temple: ఆ గుడికి వెళ్తే.. బంగారం ఫ్రీ..! భక్తులకు ప్రసాదంగా బంగారు, వెండి నాణాలు.. ఎక్కడంటే.?
Child cooking: ఈ బుడ్డోడు గరిటపడితే బాల భీముడే.. బుడతడి వంటకు నెటిజన్లు ఫిదా..!