Eye drops: కంటిచూపు మసకబారుతోందా.. మీకో గుడ్‌న్యూస్.. ఇక కళ్లజోడుతో కూడా పనిలేదు..
కళ్లద్దాలు లేకుండా పేపర్ చదవలేకపోతున్నారా... చిన్న చిన్న అక్షరాలు కనిపించక ఇబ్బంది పడుతున్నారా... అయితే మీకో గుడ్ న్యూస్..
కళ్లద్దాలు లేకుండా పేపర్ చదవలేకపోతున్నారా… చిన్న చిన్న అక్షరాలు కనిపించక ఇబ్బంది పడుతున్నారా… అయితే మీకో గుడ్ న్యూస్.. కళ్లద్దాలు లేకుండానే ఇకపై మీరు పేపర్ చదివేయొచ్చు… మీకు ఇష్టమైన పుస్తకాలు కూడా చదువుకోవచ్చు..చత్వారంతో కళ్లు కనిపించక ఇబ్బందులు పడుతున్న వారి కోసం సరికొత్త ఔషధం వచ్చేసింది. చుక్కల మందు రూపంలో అందుబాటులోకి వచ్చిన దీనిని కంటిలో వేసుకున్న 15 నిమిషాలకే కళ్లలో మసకపోయి కంప్యూటర్, ఫోన్ స్క్కీన్‌ను స్పష్టంగా చూడొచ్చు. అలాగే పుస్తకాలు, పేపర్లను ఎంచక్కా చదువుకోవచ్చు.వాస్తవానికి 40 ఏళ్లు వచ్చాక చాలామందిలో కొద్దిపాటి సైట్ మొదలవుతుంది. ఇదొచ్చిన వారు కళ్లజోడు అవసరం లేకుండా పుస్తకాలు చదవలేరు. దీంతో ఇలాంటి వారి కోసం ‘వ్యూటీ’ చుక్కల మందు అందుబాటులోకి వచ్చింది. అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ ఎఫ్‌డీఏ దీనికి అనుమతినిచ్చింది. కన్ను పనిచేసే తీరును బట్టి ఈ చుక్కల మందు పనిచేస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఎఫ్‌డీఏ అనుమతితో చత్వారాన్ని సరిచేసే తొలి చుక్కల మందుగా ‘వ్యూటీ’ రికార్డులకెక్కింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Google Search: ఈ 3 విషయాలు గూగుల్‌లో సెర్చ్ చేయకండి.. చేస్తే జైలుకెళ్లడం కన్ఫమ్..!
Ratlam Temple: ఆ గుడికి వెళ్తే.. బంగారం ఫ్రీ..! భక్తులకు ప్రసాదంగా బంగారు, వెండి నాణాలు.. ఎక్కడంటే.?
Child cooking: ఈ బుడ్డోడు గరిటపడితే బాల భీముడే.. బుడతడి వంటకు నెటిజన్లు ఫిదా..!
అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన భారతీయ రైల్వే
ఉద్యోగం నిలబెట్టుకోవాలంటే..ఈ 5 స్కిల్స్ తప్పనిసరి..!
గ్యాస్ అక్కర్లేదు.. కిరోసిన్, నీటితో నడిచే స్టవ్ వచ్చేసింది
బోను నుంచి తప్పించుకున్న చిరుత.. ఆ తర్వాత సీన్ చూస్తే..
సముద్ర గర్భంలో భారీగా బంగారం, వెండి..వేట మొదలు పెట్టిన చైనా
లక్ష.. లక్ష్మీకాసులతో 12 అడుగుల గణపయ్య!
రెండేళ్ల కష్టం నేడు వినాయకుడి రూపం.. పవన్‌కు గిఫ్ట్‌గా!

