APP for Covid: వాయిస్‌ విని పాజిటివా నెగెటివా చెప్పేస్తుంది.. కోవిడ్‌ జాడను కనిపెట్టే స్మార్ట్‌ఫోన్‌ యాప్‌..(వీడియో)

APP for Covid: వాయిస్‌ విని పాజిటివా నెగెటివా చెప్పేస్తుంది.. కోవిడ్‌ జాడను కనిపెట్టే స్మార్ట్‌ఫోన్‌ యాప్‌..(వీడియో)

Anil kumar poka

|

Updated on: Sep 12, 2022 | 8:50 AM

కృత్రిమ మేథతో కోవిడ్‌ జాడను పసిగట్టి చెప్పే స్మార్ట్‌ఫోన్‌ యాప్‌ను శాస్త్రవేత్తలు అభివృద్ధిచేశారు. కోవిడ్‌ కారణంగా వ్యక్తి గొంతులో శ్వాస మార్గం, స్వరపేటికలు ఇన్ఫెక్షన్‌కు గురవుతాయి.


కృత్రిమ మేథతో కోవిడ్‌ జాడను పసిగట్టి చెప్పే స్మార్ట్‌ఫోన్‌ యాప్‌ను శాస్త్రవేత్తలు అభివృద్ధిచేశారు. కోవిడ్‌ కారణంగా వ్యక్తి గొంతులో శ్వాస మార్గం, స్వరపేటికలు ఇన్ఫెక్షన్‌కు గురవుతాయి.‘మనిషి గొంతు విని అతనికి కోవిడ్‌ సోకిందో లేదో ఈ యాప్‌ చెప్పగలదు. కోవిడ్‌ ర్యాపిడ్‌ యాంటీజెన్‌ టెస్ట్‌ కంటే ఎక్కువ ఖచ్చితత్వంతో ఫలితాలు ఇస్తుంది. ఎలాంటి ఖర్చు లేకుండా, త్వరగా, సులభంగా కోవిడ్‌ జాడ కనిపెట్టే విధానమిది. వాయిస్‌ను రికార్డ్‌ చేసి చెక్‌ చేస్తే సరిపోతుంది. నిమిషంలో ఫలితం వచ్చేస్తుంది. పేద దేశాలకు ఇది ఎంతో ఉపయోగకరం” అని పరిశోధకులు చెప్పారు. స్పెయిన్‌లో నిర్వహించిన యురోపియన్‌ రెస్పిరేటరీ సొసైటీ ఇంటర్నేషనల్‌ కాంగ్రెస్‌లో ఈ యాప్‌ సంబంధ వివరాలను బహిర్గతం చేశారు. ఆరోగ్యవంతులు, అస్వస్తులైన వారివి కలిపి 4,352 మందికి చెందిన 893 ఆడియో శాంపిళ్లను తీసుకున్నారు. ఇందులో 308 మంది కోవిడ్‌ రోగుల వాయిస్‌లూ ఉన్నాయి. యాప్‌ టెస్ట్‌లో భాగంగా నోటితో మూడు నుంచి ఐదుసార్లు గట్టిగా శ్వాస తీసుకోవాలి. మూడు సార్లు దగ్గాలి. స్క్రీన్‌ మీద చిన్న వాక్యాన్ని చదవాలి. వీటిని రికార్డ్‌ చేసిన యాప్‌ నిమిషంలో ఫలితాలు చూపిస్తుంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Bride Running on Road: నీ తల్లీ అంటూ మరోసారి తెలంగాణ శకుంతలను గుర్తు చేసిన మహిళా.. నన్ను పెళ్లి చేసుకుంటావా..లేదా..!

Mother sentiment: పసితనంలో తల్లిని పోగొట్టుకొని.. ఆమె తల్లి సమాధి వద్ద ఈ పిల్లాడు చేసిన పనికి మీకు కూడా కనీళ్లు ఆగవు..

Published on: Sep 12, 2022 08:50 AM