రోజూ వ్యాయామం చేయలేకపోతున్నారా.. అయితే మీకో గుడ్‌ న్యూస్‌

రోజూ వ్యాయామం చేయలేకపోతున్నారా.. అయితే మీకో గుడ్‌ న్యూస్‌

Phani CH

|

Updated on: Oct 13, 2024 | 8:11 PM

మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే వ్యాయామం తప్పనిసరి అని వైద్యులు, నిపుణులు చెబుతారు. ప్రపంచాన్ని కుదిపేసిన కరోనా మహమ్మారి ప్రజలకు ఆరోగ్యం పట్ల ఎంత అలర్ట్‌గా ఉండాలో చెప్పకనే చెప్పింది. అప్పట్నుంచి ప్రజలు ఆరోగ్యం, వ్యాయామంపై శ్రద్ధ పెడుతున్నారు. అయినా కొందరు ఇంకా ఉరుకుల పరుగుల జీవితంతో తినడానికి కూడా సమయం లేకుండా కాలం గడుపుతున్నారు.

మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే వ్యాయామం తప్పనిసరి అని వైద్యులు, నిపుణులు చెబుతారు. ప్రపంచాన్ని కుదిపేసిన కరోనా మహమ్మారి ప్రజలకు ఆరోగ్యం పట్ల ఎంత అలర్ట్‌గా ఉండాలో చెప్పకనే చెప్పింది. అప్పట్నుంచి ప్రజలు ఆరోగ్యం, వ్యాయామంపై శ్రద్ధ పెడుతున్నారు. అయినా కొందరు ఇంకా ఉరుకుల పరుగుల జీవితంతో తినడానికి కూడా సమయం లేకుండా కాలం గడుపుతున్నారు. ఇంక వ్యాయామం ఏం చేయగలరు? రోజూ వ్యాయామం చేయాలని ఉన్నా చేయలేకపోతున్నామే అని బాధపడుతుంటారు. అలాంటి వారికోసం ఇది గుడ్‌ న్యూస్‌ అని చెప్పాలి. ఎందుకంటే రోజూ వ్యాయామం చేయలేకపోయినా వారానికి ఒక్కసారైనా వ్యాయామం చేసినా చాలంటున్నారు నిపుణులు. రోజూ వ్యాయామం చేయటం కుదరని వారు కనీసం వారాంతాల్లోనైనా చేయమంటున్నారు నిపుణులు. రోజూ చేసే వ్యాయామంతో సమానంగా ఇదీ ప్రయోజనాలు కల్పించే అవకాశముందని మసాచుసెట్స్‌ జనరల్‌ హాస్పిటల్‌ పరిశోధకులు గుర్తించారు. ఈ అధ్యయనంలో భాగంగా చేతికి యాక్సిలరోమీటర్లతో కూడిన పరికరాలు ధరించిన సుమారు 90వేల మంది ఆరోగ్య వివరాలను విశ్లేషించారు. వీరిలో రోజూ వ్యాయామం చేసేవారు, వారాంతాల్లో చేసేవారు అంతగా చేయనివారిని బృందాలుగా విభజించారు. వారానికి 150 నిమిషాల కన్నా తక్కువగా శ్రమ చేసేవారిని అంతగా వ్యాయామం చేయని వర్గంలో చేర్చారు. అందరిలోనూ మానసిక, జీర్ణకోశ, నాడీ సమస్యలతో పాటు మొత్తం 678 జబ్బుల తీరుతెన్నులను పరిశీలించారు. అంతగా వ్యాయామం చేయనివారితో పోలిస్తే- రోజూ చేసేవారితో పాటు వారాంతాల్లో చేసేవారిలోనూ 200కు పైగా జబ్బుల ముప్పు తక్కువగా ఉంటున్నట్టు తేలింది. వ్యాయామం ప్రయోజనం అధిక రక్తపోటు, మధుమేహం జబ్బుల ముప్పును గణనీయంగా తగ్గించడమే.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

సెకండ్ క్లాస్ స్లీపర్ టికెట్‌తో ఏసీ కోచ్‌లో ప్రయాణం.. ఎలాగో తెలుసా ??

వాహనదారులకు గుడ్‌న్యూస్..కేంద్రం కొత్త పాలసీ ఇదే

స్పా సెంటర్‌ తీరుతో మహిళా కలెక్టర్‌కు అనుమానం.. తాళాలు పగలగొట్టి చూస్తే !!

UPI Lite: యూపీఐ లైట్‌ పరిమితి పెంపు

‘యానిమల్‌’ ట్రోలింగ్‌ని త్రిప్తి డిమ్రి ఎలా మేనేజ్ చేసిందంటే