Vande Bharat: మరోమారు వందేభారత్‌ రైలుపై రాళ్లు.! దాడితో రైలు కిటికీలు ధ్వంసం.

వందేభారత్ రైలు ప్రారంభించిన తొలినాళ్లలో అనేక చోట్ల ఈ రైలుపై రాళ్లు రువ్వారు. కారణం ఏదైనా వందేభారత్‌ వేగానికి ఎన్నో ప్రమాదాలు కూడా జరిగాయి. ఈ రైలు వేగానికి కొన్ని చోట్ల జంతువులు మృత్యువాతపడ్డాయి. ఒకానొక సందర్భంలో ఈ వందేభారత్ రైలులో వర్షపు నీరు లీకైంది కూడా. ఇలా పలు విమర్శలు, సమస్యలు ఎదుర్కొని ఇప్పుడు విజయవంతంగా పలు రాష్ట్రాల్లో వందేభారత్ సేవలు కొనసాగుతున్నాయి.

Vande Bharat: మరోమారు వందేభారత్‌ రైలుపై రాళ్లు.! దాడితో రైలు కిటికీలు ధ్వంసం.

|

Updated on: Mar 20, 2024 | 6:00 PM

వందేభారత్ రైలు ప్రారంభించిన తొలినాళ్లలో అనేక చోట్ల ఈ రైలుపై రాళ్లు రువ్వారు. కారణం ఏదైనా వందేభారత్‌ వేగానికి ఎన్నో ప్రమాదాలు కూడా జరిగాయి. ఈ రైలు వేగానికి కొన్ని చోట్ల జంతువులు మృత్యువాతపడ్డాయి. ఒకానొక సందర్భంలో ఈ వందేభారత్ రైలులో వర్షపు నీరు లీకైంది కూడా. ఇలా పలు విమర్శలు, సమస్యలు ఎదుర్కొని ఇప్పుడు విజయవంతంగా పలు రాష్ట్రాల్లో వందేభారత్ సేవలు కొనసాగుతున్నాయి. తాజాగా మరోమారు ఈ వందేభారత్ రైలుపై అల్లరిమూకలు రాళ్లు రువ్వారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. ఈ ఘటనతో రైల్వేశాఖలో మరోమారు కలలకం చెలరేగింది. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితులను పర్యవేక్షించారు. యూపీలోని లక్నో నుంచి ప్రయాగ్‌రాజ్ వెళ్తున్న వందే భారత్ రైలుపై శ్రీరాజ్‌ నగర్‌-బచ్రావాన్‌ మధ్య రాళ్లదాడి జరిగింది. ఈ ఘటనలో రైలు కిటికీ అద్దాలు ధ్వంసం అయ్యాయి. గేట్ నంబర్ 178 సమీపంలో రైలుపై బయటి నుంచి ఎవరో రాళ్లు విసిరారు. దీంతో రైలులోని సీ-3 కోచ్ కిటికీ అద్దం బద్దలయ్యింది. రైలు టెక్నీషియన్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనలో ప్రయాణికులెవరికీ ఎలాంటి గాయాలూ కాలేదు. దాంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.

ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.

‘నా భర్త VDలా ఉండాలి.!’ నో కన్ఫూజన్‌ తెలిసిన కాంబినేషనేగా..

Follow us