Property Tax: పన్ను ఎగవేతదారులకు చుక్కలు చూపిస్తున్న మున్సిపల్‌ అధికారులు.

పన్ను ఎగ్గొట్టి..చక్కగా ఇంటి ముందు గేటు, వెనుక గేటు, లోపలి తలుపులు లాక్‌ చేసుకొని హాయిగా నిద్రపోతున్నారా? ఇదిగో మీకోసమే ఈ న్యూస్‌. జాగ్రత్త.. తెల్లారేసరికి మీ గేట్లు కనిపించకపోవచ్చు.. ఫర్నీచర్‌ మిస్‌ అవ్వొచ్చు.. ఆనక లబోదిబోమన్నా ప్రయోజనం ఉండదు. పన్ను చెల్లింపులో నిర్లక్ష్యం వహిస్తున్న మొండి బకాయిదారులకు మున్సిపాలిటీ అధికారులు షాక్ ఇస్తున్నారు.

Property Tax: పన్ను ఎగవేతదారులకు చుక్కలు చూపిస్తున్న మున్సిపల్‌ అధికారులు.

|

Updated on: Mar 20, 2024 | 6:29 PM

పన్ను ఎగ్గొట్టి..చక్కగా ఇంటి ముందు గేటు, వెనుక గేటు, లోపలి తలుపులు లాక్‌ చేసుకొని హాయిగా నిద్రపోతున్నారా? ఇదిగో మీకోసమే ఈ న్యూస్‌. జాగ్రత్త.. తెల్లారేసరికి మీ గేట్లు కనిపించకపోవచ్చు.. ఫర్నీచర్‌ మిస్‌ అవ్వొచ్చు.. ఆనక లబోదిబోమన్నా ప్రయోజనం ఉండదు. పన్ను చెల్లింపులో నిర్లక్ష్యం వహిస్తున్న మొండి బకాయిదారులకు మున్సిపాలిటీ అధికారులు షాక్ ఇస్తున్నారు. మున్సిపల్ బకాయిలు చెల్లించని వారిపై కొరడా ఝుళిపిస్తున్నారు. నోటీసులు ఇచ్చినా స్పందించని వారికి తమదైనశైలిలో చుక్కలు చూపిస్తున్నారు. ఇంటికున్న గేట్లు, విలువైన ఫర్నీచర్‌ స్వాధీనం చేసుకుంటున్నారు. ఈ ఘటన నిర్మల్‌ జిల్లాలో చోటుచేసుకుంది. నిర్మల్‌ జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వన్ ఇచ్చిన ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తూ పన్ను ఎగవేత దారులకు‌ తమదైన స్టైల్ లో చుక్కలు చూపిస్తున్నారు మున్సిపల్ అదికారులు. జిల్లా కేంద్రంలోని ప్రియదర్శినినగర్‌ కాలనీ, గాజుల్‌పేట కాలనీల్లో సోమవారం పన్నుల వసూలుకు వెళ్లిన మున్సిపల్ సిబ్బంది.. మొండి బకాయి దారుల ఇంటి నుండి సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు. రెండు కాలనీల్లోని ఆరు ఇళ్ల యజమానులు గత కొన్ని నెలలుగా పన్నులు చెల్లించకపోవడంతో రెడ్ నోటీసులు‌జారీ చేశారు అధికారులు. రెవెన్యూ అధికారి అనూప్‌ కుమార్‌ ఆధ్వర్యంలో సదరు ఇళ్ల గేట్లను జప్తు చేసి మున్సిపల్ కార్యలయానికి తరలించారు. పన్నుల వసూళ్ల కై ప్రత్యేక బృందాలుగా ఏర్పడిన మున్సిపల్ సిబ్బంది.. పట్టణంలోని రెండు కాలనీలలో కొరడా ఝలిపించారు. ప్రభుత్వ నిధులపై ఆధారపడకుండా మున్సిపాలిటీ ఆదాయంతోనే అభివృద్ధి చేసుకోవాలని కలెక్టర్ ఆదేశించడంతో.. ఇలా మొండి బకాయిలు వసూలు చేసే పనిలో పడ్డారు మున్సిపల్ అధికారులు, సిబ్బంది. 8 బృందాలుగా ఏర్పడిన సిబ్బంది.. ప్రతిరోజు ఉదయం ఏడు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు వార్డుల వారీగా తిరుగుతూ మున్సిపల్ ట్యాక్స్ చెల్లించని వారిని వెంటనే పన్ను చెల్లించాలని సూచిస్తున్నారు. అయినా వినని లబ్ధిదారుల సామాగ్రిని జప్తు చేసి షాక్ ఇస్తున్నారు. బకాయిలు చెల్లించకపోగా.. ఎదురు తిరుగుతున్న బకాయిదారులపై కేసులు పెడుతామంటూ చెప్తున్నారు. జప్తు చేసిన సామాగ్రిని పన్ను చెల్లించి తీసుకెళ్లాలని లేదంటే వేలం‌వేస్తామని హెచ్చరిస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.

ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.

‘నా భర్త VDలా ఉండాలి.!’ నో కన్ఫూజన్‌ తెలిసిన కాంబినేషనేగా..

Follow us