Costly French Fries: ఆలుతో చేసే ఫ్రెంచ్ ఫ్రైస్ గురించి మనందరికీ తెలిసిందే. వీటిని మనం ఇంట్లో తయారు చేసుకుంటే మహా అయితే ఓ రూ. 20 ఖర్చు అవుతుంది. అదే ఓ రెస్టారెంట్‌లో తింటే ఎక్కువలో ఎక్కువ రూ. 100 ఉంటుంది. మరి రూ. లక్షన్నర విలువ చేసే ఫ్రెంచ్ ఫ్రైస్ ఉందని చెబితే మీరు నమ్ముతారా.? మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో తయారు చేసిన ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ ప్లేట్ ధర అక్షరాల లక్షన్నర రూపాయాలు. అంతలో ఇందులో ఏముంది.. ఏమైనా బంగారంతో చేస్తారా.? అని అనుకుంటున్నారు. కదూ.. కానీ ఇది నిజమే.
అమెరికాలోని న్యూయార్క్ నగరంలో ఉన్న సెరెన్‌డిప్టీ అనే రెస్టారెంట్‌లో ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఫ్రెంచ్ ఫ్రైస్‌ను తయారు చేశారు. దీని తయారీలో ప్రపంచంలోనే అత్యుత్తమైన పదార్థాలను ఉపయోగించారు. అంతేకాకుండా వీటిలో తినదగిన 23 క్యారెట్ల బంగారం పొడిని కూడా ఉపయోగించారు. ఇన్ని ప్రత్యేకతలు ఉన్నాయి కాబట్టే ఈ ఫ్రెంచ్ ఫ్రైస్.. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఫ్రెంచ్ ఫ్రైస్‌గా గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కింది. ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ తయారీకి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. మరి మీరు కూడా ఈ వీడియోను చూసేయండి..
Mehaboob Dil Se : మెహబూబ్ దిల్ సే బర్త్ డే సెలబ్రేషన్స్‌లో ఆగమాగం చేసిన సోహెల్..
Viral Video: అమ్మో మాములుగా లేదే.. ఆటా.. పాటతో అత్తవారింట్లో దుమ్మురేపిన కొత్త కోడలు..