సముద్రపు ఒడ్డున వాకింగ్‌ చేస్తున్న మహిళ.. అక్కడ కనిపించింది చూసి షాక్‌ !!

సముద్రపు ఒడ్డున వాకింగ్‌ చేస్తున్న మహిళ.. అక్కడ కనిపించింది చూసి షాక్‌ !!

Phani CH

|

Updated on: Oct 01, 2022 | 9:51 AM

సముద్రం ఎన్నో జీవులకు ఆవాసం. అందులో మనకు తెలిసిన జీవులు కొన్నే. చేపల్లో సైతం మనకు తెలిసినవి కొన్నే. తెలియనవి ఎన్నో రకాలు ఉన్నాయి.

సముద్రం ఎన్నో జీవులకు ఆవాసం. అందులో మనకు తెలిసిన జీవులు కొన్నే. చేపల్లో సైతం మనకు తెలిసినవి కొన్నే. తెలియనవి ఎన్నో రకాలు ఉన్నాయి. తాజాగా ఒక టాస్మానియన్ మహిళ బ్రూనీ ద్వీపం వద్ద ఇసుకలో ఓ అరుదైన చేపను కనుగొంది. మొదట దాన్ని చూసి ఆమె.. సముద్రపు పాచి మొక్క అనుకుంది. కానీ ఆ చేపకు ఉనన్ కన్ను కనిపించడంతో ఆశ్చర్యపోయింది. ఆ చేప చాలా ట్రాన్స్పరెంట్‌గా ఉంది. చేతిలో పెట్టుకుంటే చేప శరీరంలో నుంచి కింద ఉన్న అర చేయి చాలా క్లియర్‌గా కనిపిస్తుంది. అసలు దాని మెదడు ఎక్కడ ఉంది.. దాని లోపల ఏదైనా శరీర నిర్మాణం ఉందా అని ఆ మహిళ ఆశ్చర్యపోవడమే కాదు, ఒకింత గందరగోళానికి గురైంది. మాక్వేరీ యూనివర్శిటీలోని జీవశాస్త్రవేత్త ప్రొఫెసర్ కులమ్ బ్రౌన్ ఈ విచిత్రమైన చేప ఈల్ జాతికి చెందిన లార్వా అని చెప్పారు. ఇవి సముద్రంలో పొదగబడతాయని వెల్లడించారు. ఈల్ జాతి చేపల లావాలు మొదట చిన్నవిగా, సన్నగా, చదునుగా, పారదర్శకంగా ఉంటాయని తెలిపారు. తీరానికి చేరుకునే కొద్దీ అవి క్రమంగా బలపడతాయని, పొడవుగా మారడం ప్రారంభిస్తాయన్నారు. పూర్తిగా పెరిగిన తర్వాత ఆకుపచ్చ లేదా గోధుమ రంగులోకి మారుతాయని తెలిపారు. ఆపై ఇవి నదులు, సెలయేర్లలోకి వలస వెళ్తాయని వివరించారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వంట పాత్రలో ఇరుక్కుపోయిన చిన్నారి తల.. అయినా తగ్గలే.. నెట్టింట వైరల్‌గా మారిన వీడియో

వంట పాత్రలో ఇరుక్కుపోయిన చిన్నారి తల.. అయినా తగ్గలే.. నెట్టింట వైరల్‌గా మారిన వీడియో

దోస్త్ మేరా దోస్త్.. తాబేలుతో ఎంజాయ్ చేస్తున్న చిరుత !!

ఇంటర్నెట్‌ను షేక్‌ చేస్తున్న ఒకే ఒక్క ఫోటో.. అందులో ఏముందంటే ??

News Watch: ఆ రేప్ కేసులోనలుగురు మైనర్లు… మేజర్లే… మరిన్ని వార్తా కథనాల సమాహారం కోసం వీక్షించండి న్యూస్ వాచ్

Published on: Oct 01, 2022 09:51 AM