వంట పాత్రలో ఇరుక్కుపోయిన చిన్నారి తల.. అయినా తగ్గలే.. నెట్టింట వైరల్‌గా మారిన వీడియో
చిన్న పిల్లలు ఆడుకుంటూ ఉన్న సందర్భంలో అనుకోకుండా ప్రమాదాలబారిన పడుతుంటారు. ఆ సమయంలో ఎవరైనా పెద్దలు చూస్తే పర్వాలేదు. లేదంటే పెను ప్రమాదాలకు దారితీసే ఛాన్స్ ఉంటుంది.
చిన్న పిల్లలు ఆడుకుంటూ ఉన్న సందర్భంలో అనుకోకుండా ప్రమాదాలబారిన పడుతుంటారు. ఆ సమయంలో ఎవరైనా పెద్దలు చూస్తే పర్వాలేదు. లేదంటే పెను ప్రమాదాలకు దారితీసే ఛాన్స్ ఉంటుంది. తాజాగా అలా ఆడుకుంటూ ఓ ప్రమాదంలో ఇరుక్కున్నాడు ఓ బుడ్డోడు. వాడు చేసిన పనికి చుట్టుపక్కలవారందరినీ కంగారు పెట్టేసాడు. చివరికి కుటుంబ సభ్యులు, స్థానికుల సహాయంతో పెను ప్రమాదం నుంచి బయటపడ్డాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ.. పేరెంట్స్‌ను ఆలోచనలో పడేసింది. వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ చిన్నారి వంట పాత్రలతో ఆడుకుంటూ ఆ గిన్నెను తలపైన టోపీలాగా ధరించాడు. ఇంకేముంది ఆ బుడ్డోడి తల అందులో ఇరుక్కుపోయింది. ఇక అందులోంచి తలను బయటకు రాకపోవడంతో ఏడుపు అందుకున్నాడు. అది గమనించిన కుటుంబ సభ్యులు, స్థానికులు ఆ చిన్నారి తలను బటయకు తీయడానికి శతవిధాలా ప్రయత్నించారు. కానీ తల బయటకు రాలేదు. దాంతో కట్టర్ తీసుకొచ్చి గిన్నెను కట్ చేసారు. ఈ క్రమంలో ఏడుస్తున్న బుడ్డోడి చేతిలో ఓ జామకాయ ఉంచారు. పెద్దవాళ్లు తలపై గిన్నె తీసే పనిలో ఉంటే ఈ బుడ్డోడు జామకాయ తినడంలో నిమగ్నమయ్యాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఓరి బుడ్డోడా.. ఎంతపని చేశావురా.. అంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వంట పాత్రలో ఇరుక్కుపోయిన చిన్నారి తల.. అయినా తగ్గలే.. నెట్టింట వైరల్‌గా మారిన వీడియో
దోస్త్ మేరా దోస్త్.. తాబేలుతో ఎంజాయ్ చేస్తున్న చిరుత !!
ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్న ఒకే ఒక్క ఫోటో.. అందులో ఏముందంటే ??
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

