కుక్క ఎంత పని చేసింది? ఇంటినే తగలబెట్టిందిగా వీడియో
నార్త్ కరోలినాలో కార్ల్టన్ అనే పెంపుడు కుక్క లిథియం బ్యాటరీని కొరకడంతో ఇంట్లో మంటలు చెలరేగాయి. కుటుంబ సభ్యులు ఇంట్లో లేని సమయంలో ఈ ఘటన జరిగింది. మంటలు వ్యాపించకముందే ఫైర్ అలారం మోగడంతో అగ్నిమాపక శాఖ స్పందించి అదుపు చేసింది. ఈ సంఘటన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
పెంపుడు కుక్కలు అల్లరి చేస్తాయనేది తెలిసిందే. కానీ అమెరికాలోని నార్త్ కరోలినాలో జరిగిన ఒక సంఘటన ఆశ్చర్యానికి గురిచేసింది. కార్ల్టన్ అనే అల్లరి కుక్క ఇంట్లోని లిథియం బ్యాటరీని కొరకడంతో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. కుటుంబ సభ్యులు ఇంటి బయట ఉన్న సమయంలో, కార్ల్టన్ దాని తోడు పిల్లితో ఇంట్లో ఉంది. ఆ సమయంలో కుక్క ఆడుకుంటూ ఒక లిథియం బ్యాటరీని కొరికింది. కొద్దిసేపటి తర్వాత ఆ బ్యాటరీ పేలి, ఇంట్లో మంటలు చెలరేగాయి. వెంటనే కుక్క, పిల్లి అక్కడి నుంచి పారిపోయాయి.అదృష్టవశాత్తూ, ఇంట్లోని ఫైర్ అలారం మోగడంతో అగ్నిమాపక విభాగానికి సమాచారం అందింది. వారు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. లేకుంటే ఇల్లు పూర్తిగా దగ్ధమై ఉండేది. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
మరిన్ని వీడియోల కోసం :
నేనెవరో తెలుసా? నా బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
హైదరాబాద్ బిర్యానీ కోసం బిహార్‌లో ఫైటింగ్ వీడియో
ఇదేందిరా మామ ఇలా ఉన్నాడు.. భార్యపై కోపంతో ఏకంగా అత్తింటికే నిప్పు పెట్టాడుగా
డ్యాన్స్‌లో మామ మల్లారెడ్డితో పోటీపడ్డ కోడలు ప్రీతిరెడ్డి వీడియో
అయ్యో.. ఇలాంటి కష్టం ఏ రైతుకీ రాకూడదు!
సబ్ రిజిస్ట్రార్కే కుచ్చు టోపీ పెట్టారుగా
అందం ఎరగా వేసి అమ్మాయిలతో న్యూడ్ కాల్స్.. ఆ తర్వాత
డైరెక్ట్ గా ఇంట్లోకి చొరబడుతోన్న గొలుసు దొంగలు
లక్కీ డ్రాలో రూ.250 కే సొంతిల్లు! పోలీసుల రంగ ప్రవేశంతో
ఆ ఊరి కుక్కలన్నీ వారికి నేస్తాలే.. శునకాల సేవలో ఆధ్యాత్మిక ఆనందం
వీడసలు టీచరేనా.. విద్యార్థినిని ఏమార్చి.. అలా ఎలా చేసాడు
