సాధారణంగా ఏడు పదుల వయసు దాటిన వారు ఎలా ఉంటారు. ఆధ్యాత్మిక పఠనం చేసుకుంటూ గడిపేస్తూ ఉంటారు. కానీ వృద్ధాప్యం తమలోని కళకు అవరోధం కాదని అప్పుడప్పుడు కొందరు నిరూపిస్తూ ఉంటారు. తమలో ఉన్న కళను ప్రదర్శించేందుకు వయసు అడ్డు కాదని నిరూపించారు 71 ఏళ్ల గ్రేటా. ఏ మాత్రం అలసట లేకుండా టీనేజర్స్ కంటే చలాకీగా ఉన్నారు. ఇంతకీ ఆమె ఏం చేశారో తెలుసా.. ఆ విషయం తెలిస్తే మాత్రం మీరు కచ్చితంగా నోరెళ్లబెడతారు. పోల్ డ్యాన్స్(Pole dance) చేసి అందరినీ అబ్బురపరిచారు. తాడులా మారిపోయి పోల్‌ని చుట్టేసుకున్నారు. ఒంట్లో ఎముకలే లేన్నట్లుగా మెలికలు తిరిగిపోయారు. ఈమె టాలెంట్(Talent) ను చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఈ వయసులో ఇంత చురుకుగా ఎలా ఉండగలుగుతున్నారని ప్రశంసిస్తున్నారు. వీడియోకు(Viral Video) ఫిదా అయ్యామంటూ కామెంట్లు చేస్తున్నారు.
అమెరికాలోని కాలిఫోర్నియాలో గ్రేటా నివాసముంటున్నారు. ఈమె 11సార్లు పోల్ డ్యాన్స్ ప్రపంచ ఛాంపియన్‌షిప్ టైటిల్ కైవసం చేసుకున్నారు. గ్రేటాకు చిన్న వయసు నుంచే జిమ్నాస్టిక్స్ చేయాలనే కోరిక ఉండేది. మొదటి సారి తనకంటే సుమారు 50సంవత్సరాల చిన్నదైన 18ఏళ్ల పోల్ డ్యాన్సర్‌తో పోటీ పడింది. ఆ విజయంతో అప్పటి నుండి, ఆమె ప్రపంచ వరల్డ్ పోల్ డ్యాన్సర్‌గా కొనసాగుతోంది. అయితే 59 సంవత్సరాల వయసులో గ్రేటాకు ఎముకల వ్యాధి సోకింది. ఆ వ్యాధిని నయం చేసుకునేందుకు పోల్ డ్యాన్స్ మొదలుపెట్టింది. మొదట్లో కాస్త ఇబ్బందిగా, కష్టంగా ఉన్నప్పటికి ఆమె పట్టుదలతో గురుత్వాకర్షణను కంట్రోల్ చేయగలిగే ట్రిక్స్ నేర్చుకుంది. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేకుండా వరుస విజయాలతో దూసుకెళ్తోంది గ్రేటా. పెరుగుతున్న వయసును తాను ఒక సంఖ్యలా చూస్తానే గానీ.. అది తన సంకల్పాన్ని ఏ మాత్రం అడ్డంకి కాదని చెబుతున్నారు.
Also Read
Chanakya Niti: ఇటువంటి లక్షణాలున్న వ్యక్తులు.. కుటుంబ సభ్యులు కూడా శత్రువులు అవుతారానంటున్న చాణక్య
Tollywood: పక్కా ప్లానింగ్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్న బడా సినిమాలు..