Wedding in Flight: కూతురి పెళ్లిని విమానంలో జరిపించిన తండ్రి.. 300 మంది అతిథుల హాజరు.
పెళ్లి అనేది జీవితంలో మరపురాని వేడుక. అందుకని ఎప్పటికీ గుర్తుండిపోయేలా తమ పెళ్లి వేడుకలు నిర్వహించుకుంటున్నారు నేటి యువతరం. తల్లిదండ్రులు కూడా తమ పిల్లల పెళ్లిళ్లను స్థోమతకు తగ్గటు ఘనంగా జరిపించాలని భావిస్తున్నారు. కాపురం పది కాలాల పాటూ పచ్చగా ఉన్నట్లే.. పెళ్లి వేడుకలూ తరాల పాటూ గుర్తుండిపోవాలని అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఖర్చుకు కూడా ఏమాత్రం వెనుకాడట్లేదు.
పెళ్లి అనేది జీవితంలో మరపురాని వేడుక. అందుకని ఎప్పటికీ గుర్తుండిపోయేలా తమ పెళ్లి వేడుకలు నిర్వహించుకుంటున్నారు నేటి యువతరం. తల్లిదండ్రులు కూడా తమ పిల్లల పెళ్లిళ్లను స్థోమతకు తగ్గటు ఘనంగా జరిపించాలని భావిస్తున్నారు. కాపురం పది కాలాల పాటూ పచ్చగా ఉన్నట్లే.. పెళ్లి వేడుకలూ తరాల పాటూ గుర్తుండిపోవాలని అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఖర్చుకు కూడా ఏమాత్రం వెనుకాడట్లేదు. తాజాగా ఓ తండ్రి తన కూతురి వివాహాన్ని ఎవరూ ఊహించని విధంగా గాల్లో జరిపించి ఎప్పటికీ గుర్తుండేలా వార్తల్లో నిలిచారు. యూఏఈకి చెందిన భారతీయ వ్యాపారవేత్త దిలీప్ పోప్లే తన కుమార్తె ప్రేమ పెళ్లిని ఏకంగా ఎగురుతున్న విమానంలో జరిపించాడు. ఈ వేడుకకు 300 మంది అతిథులు హాజరై నూతన వధూవరులను ఆకాశంలో ఆశీర్వదించారు. విధి పోప్లే – హృదేశ్ సైనానీ చిన్ననాటి స్నేహితులు. ఒకే పాఠశాలలో చదువుకున్నారు. ఇద్దరి మధ్య ఉన్న స్నేహం ప్రేమగా మారింది. దీంతో పెద్దల అంగీకారంతో నవంబర్ 24న పెళ్లి చేసుకున్నారు. అయితే, వీరి పెళ్లిని వధువు తండ్రి ఎప్పటికీ గుర్తుండేలా చేయాలనుకున్నాడు.
ఈ క్రమంలో ప్రైవేట్ జెటెక్స్ బోయింగ్ 747 విమానంలో తన కుమార్తె వివాహాన్ని బంధుమిత్రుల సమక్షంలో ఘనంగా జరిపించాడు. వధూవరులు, అతిథులతో బయల్దేరిన విమానం దుబాయ్ నుండి ఒమన్‌కు 3 గంటల పాటు ప్రయాణం చేసింది. ఆ సమయంలోనే బంధుమిత్రుల సమక్షంలో ఈ ప్రేమ జంట.. భార్యాభర్తల బంధంలోకి అడుగుపెట్టింది. మరో విశేషం ఏంటంటే.. వధువు తండ్రి కూడా 30 ఏళ్ల క్రితం ఇలానే ఫ్లైట్‌లో పెళ్లి చేసుకున్నాడు. 1994లో ఎయిర్ బస్ A310లో దిలీప్ పోప్లే వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. అప్పుడు ఆ విమానం ముంబై నుంచి అహ్మదాబాద్ వరకూ ప్రయాణించింది. ఇప్పుడు మళ్లీ అదే సీన్‌నే తన కుమార్తె పెళ్లికి రిపీట్ చేశాడు దిలీప్. మరోవైపు ఈ వివాహం గురించి వరుడు.. హృదేశ్ సైనానీ మాట్లాడుతూ.. ఫ్లైట్‌లో తను హై స్కూల్ నుంచి ప్రేమించిన అమ్మాయినే పెళ్లి చేసుకోవడం చాలా సంతోషంగా ఉందన్నాడు. తమ ప్రేమ పెళ్లికి అంగీకరించిన తల్లిదండ్రులు, పెళ్లికి విచ్చేసిన మిత్రులు, బంధువులు, జెటెక్స్‌తో సహా అందరికీ ధన్యవాదాలు తెలిపాడు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.