Gaza: కాల్పుల విరమణ మరో రెండు రోజులు పొడిగింపు.. ఖతార్, ఈజిప్టు మధ్య అంగీకారం.
ఇజ్రాయెల్, హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం మరో 2 రోజులు కొనసాగనుంది. ముందుగా కుదుర్చుకున్న నాలుగు రోజుల ఒప్పందం సోమవారంతో ముగియడంతో ఖతార్, ఈజిప్టు మధ్యవర్తిత్వంతో 2 రోజుల పొడిగింపునకు రెండు వర్గాలు అంగీకరించాయి. ఈ ఒప్పందం ప్రకారం.. హమాస్ ప్రతి రోజూ 10 మంది ఇజ్రాయెలీలను విడిచి పెట్టాల్సి ఉంటుంది. ప్రతి ఒక్క బందీకి బదులుగా.. ముగ్గురు పాలస్తీనా వాసులను ఇజ్రాయెల్ వదలాల్సి ఉంటుంది.
ఇజ్రాయెల్, హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం మరో 2 రోజులు కొనసాగనుంది. ముందుగా కుదుర్చుకున్న నాలుగు రోజుల ఒప్పందం సోమవారంతో ముగియడంతో ఖతార్, ఈజిప్టు మధ్యవర్తిత్వంతో 2 రోజుల పొడిగింపునకు రెండు వర్గాలు అంగీకరించాయి. ఈ ఒప్పందం ప్రకారం.. హమాస్ ప్రతి రోజూ 10 మంది ఇజ్రాయెలీలను విడిచి పెట్టాల్సి ఉంటుంది. ప్రతి ఒక్క బందీకి బదులుగా.. ముగ్గురు పాలస్తీనా వాసులను ఇజ్రాయెల్ వదలాల్సి ఉంటుంది. ఖతార్, పశ్చిమ దేశాల మధ్యవర్తిత్వంతో ఇజ్రాయెల్, హమాస్ మధ్య ఇటీవల తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. ఇది శుక్రవారం నుంచి అమల్లోకి వచ్చింది. ఆదివారం నాటికి 58 మంది బందీలను హమాస్, 114 మందిని ఇజ్రాయెల్ విడుదల చేశాయి. నాలుగో విడత బందీలు విడుదల కావాల్సి ఉంది. మరోవైపు ఇజ్రాయెల్ జైళ్లలో మగ్గుతున్న మరింత మంది పాలస్తీనీయులను విడిపించుకోవడం కోసం కాల్పుల విరమణ పొడిగింపును కోరుతున్నట్లు హమాస్ అంతకుముందు పేర్కొంది. హమాస్ ప్రతినిధి ఒకరు ఓ ఆంగ్ల వార్తా సంస్థతో మాట్లాడుతూ.. తమ గ్రూపు కాల్పుల విరమణను మరో 2 నుంచి 4 రోజులు పొడిగించుకోవాలని భావిస్తున్నట్లు చెప్పారు. ఈ లెక్కన హమాస్ మరో 40 మంది వరకూ బందీలను విడుదల చేసేందుకు సుముఖంగా ఉన్నట్లు సమాచారం. హమాస్ ప్రకటన వచ్చిన కొద్దిసేపటికే ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఓ వీడియో సందేశం విడుదల చేశారు. ఒక్కసారి సంధి ముగిశాక ఐడీఎఫ్ పదాతి దళాల ఆపరేషన్ పునఃప్రారంభమవుతుందని అన్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.