Little Girl Viral Video: పసిపిల్లల కళ్లలో స్వచ్ఛమైన అమాయకత్వం మనకు అప్పుడప్పుడు చూస్తూనే ఉంటాం. అలాగే కొన్ని విషయాల్లో వారి ఆనందంలో మెరుపులను చూడడానికి మన కళ్లు కూడా సరిపోవు. ప్రస్తుం అలాంటి ఓ వీడియో నెట్టింట్లో తెగ సందడి చేస్తోంది. కొత్తగా అందుకున్న కళ్లజోడు ద్వారా ప్రపంచాన్ని స్పష్టంగా చూసే ఈ రెండేళ్ల బాలిక ఆనందాన్ని తట్టుకోలేకపోవడం చూసి నెటిజన్లు కూడా సంబురపడిపోతున్నారు.
గుడ్ న్యూస్ మూవ్‌మెంట్ ట్విట్టర్‌లో పంచుకున్న ఈ వీడియోలో ఓ చిట్టిపాప తన మొదటి ప్రిస్క్రిప్షన్ కళ్లద్దాలను అందుకుంది. వాటిన తన కళ్లకు పెట్టకున్నప్పుడు ఆమె ఆనందానికి అవధులు లేవని మనం ఈ వీడియోలో చూడొచ్చు.
నవంబరు 11న షేర్ చేసిన ఈ వీడియో ఐదు లక్షలకు పైగా వ్యూస్, 14,000 కంటే ఎక్కువ లైక్‌లతో నెట్టింట్లో దూసుకపోతోంది. ఈ పాప ఆనందం ప్రపంచవ్యాప్తంగా హృదయాలను గెలుచుకుంటోంది. మీరు కూడా ఈ వీడియోను చూస్తే ఫిదా అవ్వకుండా ఉండలేరు.
ఈ వీడియోను చూసిన ఎంతో మంది నెటిజన్లు తమ ఆనందాన్ని కామెంట్ల రూపంలో చూపిస్తున్నారు. “తొలిసారి కళ్లద్దాలు ధరించిన ఈ చిన్నారి చిరునవ్వు ఎంతో అమూల్యమైనది” అంటూ ఓ యూజర కామెంట్ చేశాడు. ‘తన చీకటి ప్రపంచాన్ని మాయం చేసిన కళ్లద్దాలతో వెలుగులు చిందిస్తోన్న చిన్నారి’ అంటూ మరొకరు కామెంట్ చేశారు.
“At 2 years old she could barley see as she’s extremely farsighted–this is her first time seeing things clearly in her life!” her elated parents tell Good News Movement. pic.twitter.com/hDeRXKw0IE
— GoodNewsMovement (@GoodNewsMoveme3) November 11, 2021
Watch Video: ఆసీస్ చేతిలో ఘోర ఓటమి.. అనంతరం పాక్ డ్రెస్సింగ్ రూంలో ఏం జరిగిందంటే? వీడియో మీకోసమే.!