Viral Video: భారీ కొండచిలువతో ఆటలు ఆడుతోన్న చిన్నారి.. భయం లేకుండా అల్లరి చేస్తోంది.. చూస్తే షాకవుతారు!

సోషల్ మీడియా వచ్చిన దగ్గర నుంచి ఎన్నో రకాల వైరల్ వీడియోలు తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఇందులో జంతువులకు సంబంధించిన..

Viral Video: భారీ కొండచిలువతో ఆటలు ఆడుతోన్న చిన్నారి.. భయం లేకుండా అల్లరి చేస్తోంది.. చూస్తే షాకవుతారు!
Python
Follow us
Ravi Kiran

|

Updated on: Nov 12, 2021 | 10:15 AM

సోషల్ మీడియా వచ్చిన దగ్గర నుంచి ఎన్నో రకాల వైరల్ వీడియోలు తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఇందులో జంతువులకు సంబంధించిన వీడియోలను నెటిజన్లు ఎక్కువగా ఆకట్టుకుంటాయి. అందులో కొన్ని క్యూట్‌గా ఉంటే.. మరికొన్ని ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. అలాగే ఇంకొన్ని భయాన్ని పుట్టిస్తాయి. తర్వాత ఏం జరగబోతుందో అనే ఉత్కంఠను రేపుతాయి. సరిగ్గా ఇదే కోవకు చెందిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట హల్చల్ చేస్తోంది. ఇందులో ఓ చిన్నారి పైథాన్‌తో ఇంచక్కా ఆడుకుంటోంది. ఆ వీడియోను చూస్తే మీరూ ఆశ్చర్యపోతారు.

వైరల్ వీడియో ప్రకారం.. ఓ భారీ కొండచిలువ బయట చిన్న అరుగుపైన కూర్చుని ఉన్న పాప వద్దకు పాక్కుంటూ వస్తుంది. అంతటి భారీ పాముతో భయం అనేది లేకుండా ఆ చిన్నారి అల్లరి చేస్తూ.. ఆటలు ఆడుతుంది. ఎలాంటి జంకు లేకుండా ఆ భారీ విషసర్పం తల నిమరడమే కాకుండా దానిపై పడుకుని సేద తీరుతుంది. ఇక ఇందుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

View this post on Instagram

A post shared by Snakes Mania (@snakes.mania)

కాగా, ఈ వీడియోను ‘snakes.mania’ అనే ఇన్‌స్టాగ్రామ్ పేజి పోస్ట్ చేయగా.. క్షణాల్లో వైరల్‌గా మారింది. ఇప్పటివరకు ఈ వీడియోకు 33.5 వేల వ్యూస్ వచ్చాయి. దీనిని చూసిన నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్, లైకులతో హోరెత్తిస్తున్నారు. లేట్ ఎందుకు మీరు కూడా ఓసారి ఆ వీడియోపై లుక్కేయండి.

Also Read:

మగ సింహంపై విరుచుకుపడ్డ రెండు ఆడ సింహాలు.. యుద్ధం మాములుగా లేదు.. చూస్తే షాకవుతారు!

Viral Photo: ఈ ఫోటోలో సింహం ఎక్కడుందో గుర్తించండి.. చాలామంది ఫెయిల్ అయ్యారు.!

Rohit Sharma: కెప్టెన్‌గా రోహిత్ శర్మ.. టీ20 జట్టులో కోహ్లీ స్నేహితుడికి నో ప్లేస్.. లిస్టులో మరో ఐదుగురు.!

Viral Video: ఇదేం క్రియేటివిటీ మావా.. ఈ వ్యక్తి చేసిన ఇన్వెన్ష‌న్‌కు ఇంజనీర్లు సైతం షాకవుతారు.!

ధోని స్థానాన్ని భర్తీ చేసేది అతడే.! వచ్చే ఏడాది సీఎస్‌కే రిటైన్ చేసే ఆటగాళ్లు వీరే.!