తిరుపతిలో బైకు వెంటపడిన చిరుత.. తృటిలో..
తిరుపతిలో చిరుతల భయం వీడటం లేదు. అలిపిరి వద్ద తరచూ చిరుతలు కనిపిస్తూ ఇటు భక్తులను, అటు స్థానికులను తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నాయి. శేషాచలం అటవీ ప్రాంతం నుంచి బయటకు వస్తున్న చిరుతలు అలిపిరి నుంచి జూపార్క్ వెళ్లే రోడ్డును దాటుతూ తరచూ కనిపిస్తున్నాయి. జూ పార్క్ రోడ్డులో ఆసుపత్రులు, రోడ్డుపై ఉన్న ఫుడ్ స్టాల్స్ వద్ద సంచరించే కుక్కల కోసం వస్తున్న చిరుతలు ఎస్వీ యూనివర్సిటీ, వేదిక్ యూనివర్సిటీ, వెటర్నరీ యూనివర్సిటీ లోకి ఎంట్రీ ఇస్తున్నాయి.
తాజాగా తిరుపతిలో మరోసారి చిరుతపులి సంచారం కలకలం రేపింది. అలిపిరి రోడ్డులో వెళుతున్న ఓ ద్విచక్ర వాహనంపై చిరుత దాడికి ప్రయత్నించింది. బైక్ వెనక వస్తున్న కారు డ్యాష్ కెమెరాలో ఈ ఘటన రికార్డు అయింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అలిపిరి చుట్టుపక్కల చిరుత పులుల సంచారం పెరిగిపోవడంతో తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు, ఫారెస్ట్ సిబ్బంది అప్రమత్తమయ్యారు. భక్తులు, ప్రయాణికుల రక్షణకు చర్యలు చేపట్టారు. గతంలో చిరుత సంచరించిన ప్రాంతాల్లో సిబ్బందితో గస్తీ నిర్వహిస్తున్నారు. అలిపిరి, ఎస్వీ జూ పార్క్ రోడ్డు సమీపంలో ఇటీవల చిరుతపులుల సంచారం ఎక్కువగా ఉందని స్థానికులు చెబుతున్నారు. దీంతో ఈ మార్గంలో అధికారులు గస్తీ పెంచారు. తాజాగా అలిపిరి, ఎస్వీ జూ పార్క్ రోడ్డు వద్ద ఓ చిరుత రోడ్డు పక్కనే నక్కి.. బైక్ పై వెళుతున్న వారిపై దాడికి యత్నించింది. బైక్ వేగంగా వెళుతుండడంతో వారు చిరుతకు చిక్కలేదు. చిరుత పట్టు తప్పి రోడ్డుపై పడిపోయింది. బైక్ వెనకాలే ప్రయాణిస్తున్న కారు డ్యాష్ కెమెరాలో ఈ ఘటన మొత్తం రికార్డైంది. ఈ సంఘటనతో అప్రమత్తమైన టీటీడీ అధికారులు రాత్రిపూట ఘాట్ రోడ్డుపైకి ద్విచక్ర వాహనాలను అనుమతించడం లేదు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రౌడీ బాయ్ పై గట్టిగా.. కంబ్యాక్ ఇచ్చిపడేశావ్‌పో..
Pallavi Prashanth: ఇంత బతుకు బతికి చివరకు.. పాపం! బోరున ఏడ్చేసిన రైతు బిడ్డ
మొబైల్ లో మునిగి పోయిన ముసలివాడు.. ఎక్కాల్సిన రైలు వెళ్లిపోతుండగా.. ఏం చేసాడంటే
అరుదైన భారీ పుట్టగొడుగు.. చూసి ఆశ్చర్యపోతున్న జనం
కదులుతున్న కారుపై కవ్విస్తూ డాన్స్ చేస్తున్న మహిళా.. ఫైర్ అవుతున్న నెటిజెన్స్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..

