అరుదైన భారీ పుట్టగొడుగు.. చూసి ఆశ్చర్యపోతున్న జనం
పుట్టగొడుగులు మంచి పౌష్టికాహారం. అందుకే చాలామంది దీనిని ఎంతో ఇష్టంగా తింటారు. సాధారణంగా పుట్టగొడుగులు చిన్నవిగా ఉంటాయి. ఇప్పటివరకూ మనం వీటినే ఆహారంలో భాగం చేసుకొని తింటున్నాం. అయితే ఇవి ఒక్కోసారి అందరినీ ఆశ్చర్యపరిచేలా ఊహించని సైజులో పెరుగుతుంటాయి. తాజాగా కడపజిల్లా పులివెందులలో అతిపెద్ద పుట్టగొడుగు పెరిగింది.
ఓ రైతు పొలంలో పెరిగిన ఈ పుట్టగొడుగును చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. కడప జిల్లా వేంపల్లి మండలం లోని రామ రెడ్డి పల్లె గ్రామంలో అరుదైన పుట్టగొడుగు పెరిగింది. గ్రామానికి చెందిన బోరెడ్డి నరసింహారెడ్డి పొలంలో ప్రకృతి సిద్ధంగా మొలిచిన ఈ పుట్టగొడుగు ఏకంగా ఒక కేజీ 760 గ్రాములు బరువు తూగింది. మామూలుగా మనం బయటకొనే పుట్టగొడుగులు కేజీ 750 గ్రాములు కొనాలి అంటే ఒక పెద్ద కవర్ నిండా వస్తాయి. కానీ ఈ ఈ భారీ పుట్టగొడుగు ఒక్కటే కవర్ నిండిపోయింది. గతంలోనూ ఇలాంటి పుట్టగొడుగులు ఈ గ్రామంలో కనిపించాయి. అవి కేజీ 500 గ్రాములు ఉంటే.. ప్రస్తుత పుట్టగొడుగు ఆ రికార్డును బద్దలు కొడుతూ మరో 250 గ్రాములు అదనంగా పెరిగింది. ప్రకృతి ఆధారంగా పండే ఈ పంటలు ఇక్కడ సహజసిద్ధంగా పండుతున్నాయి. అయితే వర్షాకాలం లేదా చలికాలంలో మాత్రమే ఇలాంటి జంబో పుట్టగొడుగులు దర్శనమిస్తూ ఉంటాయి. తరచూ ఈ భారీ పుట్టగొడుగులు ఈ ప్రాంతంలో సహజంగా పెరుగుతుంటాయంటున్నారు స్థానికులు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కదులుతున్న కారుపై కవ్విస్తూ డాన్స్ చేస్తున్న మహిళా.. ఫైర్ అవుతున్న నెటిజెన్స్
ప్రియురాలిని వశం చేసుకోవాలని చేయకూడని పని చేసాడు.. చివరికి
వామ్మో అంత రేటా..? కేజీ రూ. 83కి చేరిన సన్నబియ్యం..
ఇక మగాళ్లకూ ఫ్రీ బస్సే! రవాణా మంత్రి సంచలన ప్రకటన
కబోర్డ్ ఓపెన్ చేసిన మహిళ.. అందులో ఊహించని సీన్ చూసి హడల్
అర్ధరాత్రి ఉన్నట్టుండి ఇళ్లపై రాళ్ల వర్షం..
భారతీయ భార్యపై అమెరికన్ భర్త ప్రశంసల వర్షం..
చంపాక ఎలా ఏడవాలి అని చాట్‌జీపీటీని అడిగిన ప్రియురాలు
జింక కోసం మాటువేసిన పులి.. నెమలి ఎంట్రీతో..

