మొబైల్ లో మునిగి పోయిన ముసలివాడు.. ఎక్కాల్సిన రైలు వెళ్లిపోతుండగా.. ఏం చేసాడంటే
ప్రస్తుతకాలంలో ప్రతి ఒక్కరికీ మొబైల్ వ్యసనంగా మారిపోయింది. ఏ మాత్రం సమయం దొరికినా వెంటనే స్మార్ట్ ఫోన్లో మునిగిపోతున్నారు. ఈ క్రమంలో చుట్టూ పరిసరాలను కూడా మర్చిపోతున్నారు. తర్వాత అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. తాజాగా ఓ వృద్ధుడు సెల్ ఫోన్ చూస్తూ రైలు వచ్చిందన్న సంగతి గుర్తించక పోవడంతో ప్రమాదంలో పడ్డాడు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు తమదైనశైలిలో కామెంట్లు చేశారు. వైరల్ అవుతున్న ఈ వీడియోలో రైల్వే స్టేషన్‌లో ట్రైన్ కోసం ఎదురుచూస్తూ అక్కడ బెంచ్‌పైన కూర్చున్నాడు. ట్రైన్ రావడానికి ఇంకా సమయం ఉండటంతో మొబైల్ చూస్తూ కూర్చున్నాడు. దానిలో పూర్తిగా మునిగిపోయిన వృద్ధుడు రైలు వచ్చిన విషయాన్ని కూడా గమనించలేదు. మొబైల్ చూస్తూనే ఉన్నాడు. ఇంతలో ట్రైన్ కదిలిపోయింది. వేగంగా ముందుకు వెళ్తోంది. కాసేపటికి వృద్ధుడు మొబైల్ చూడ్డం ఆపి కదులుతున్న రైలును గమనించాడు. అది తాను ఎక్కాల్సిన రైలేనని గుర్తించి వెంటనే పరుగందుకున్నాడు. రైలు వేగం పుంజుకుంది. వృద్ధుడికి ఏం చేయాలో తోచలేదు. అయినా కదులుతున్న ట్రైన్ ఎక్కేందుకు ప్రయత్నించాడు. అంతే అదుపుతప్పి పడిపోయాడు. అక్కడే ఉన్న ఓ రైల్వే పోలీసు వృద్ధుడిని గమనించి వెంటనే కదిలాడు. పడిపోయిన వృద్ధుడిని ట్రాక్‌పైకి వెళ్లిపోకుండా పట్టుకున్నాడు. దీంతో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు ఆ వృద్ధుడు. ఈ సంఘటన బేతుల్ రైల్వే స్టేషన్‌లో జరిగిందని తెలుస్తుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. RPF కానిస్టేబుల్ చూపిన చొరవకి ప్రశంసల వర్షం కురుస్తోంది. ప్రతిచోటా కూర్చుని మొబైల్ చూసే వ్యక్తులకు ఈ వీడియో ఒక పాఠం కావాలని ఓ నెటిజన్ వ్యాఖ్యానించారు. నేటి ప్రజలు మొబైల్ ఫోన్లకు బానిసలయ్యారని, ఫోన్లు లేకపోతే ప్రపంచం లేనట్లు అనిపిస్తోందని మరొకరు కామెంట్ చేశారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అరుదైన భారీ పుట్టగొడుగు.. చూసి ఆశ్చర్యపోతున్న జనం
కదులుతున్న కారుపై కవ్విస్తూ డాన్స్ చేస్తున్న మహిళా.. ఫైర్ అవుతున్న నెటిజెన్స్
ప్రియురాలిని వశం చేసుకోవాలని చేయకూడని పని చేసాడు.. చివరికి
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..

