శవపేటిక నుంచి వింత శబ్ధాలు.. ఖననం చేస్తుండగా షాక్ వీడియో
ఒక వ్యక్తిని వైద్యులు చనిపోయినట్లు ప్రకటించిన తర్వాత, ఆ వ్యక్తి తిరిగి బతికలేడని చెబుతారు. కానీ స్పెయిన్‌లో, పూర్తిగా భిన్నమైన కథ కనిపించింది. అక్కడ ఒక వృద్ధ మహిళ స్మశానవాటికకు వెళ్లి తిరిగి బతికింది. చనిపోయిందనుకుని అంత్యక్రియలు నిర్వహిస్తుండగా, ఆమె శరీరం, వేళ్లు కదులుతూ కనిపించాయి. దీంతో అంతా షాక్ అయ్యారు. చనిపోయిన వ్యక్తి మళ్ళీ బతికి రావడం మనం అరుదుగా చూస్తాం. ఒకవేళ అది ఎక్కడైనా జరిగితే చాలా షాకింగ్ గా ఫీల్ అయ్యి.. అది సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తాం. తాజాగా అలాంటి సంఘటన ఒకటి జరిగింది.
చనిపోయిందనుకున్న మహిళ అంత్యక్రియలు నిర్వహిస్తుండగా ప్రాణాలతో లేచి కూర్చుంది. ఆమె కుటుంబ సభ్యులు ఆమెను చూసి షాక్ అయ్యారు. డైలీ మెయిల్‌లో ప్రచురితమైన కథనం ప్రకారం, ఓ వృద్ధ మహిళ ఆరోగ్యం క్షీణించడంతో బున్వోలా ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ ఆమె పరిస్థితి చూసిన వైద్యులు ఆమె మరణించినట్లు ప్రకటించారు. ఆ తర్వాత కుటుంబ సభ్యులు అంత్యక్రియలకు సిద్ధం చేసి స్మశానవాటికకు తీసుకెళ్లారు. ఇక్కడ స్మశానవాటిక సిబ్బంది ఆ మహిళను సమాధి వేయబోతుండగా, ఆమె శరీరం, వేళ్లు కదులుతున్నట్లు చూశారు. మొదట్లో అక్కడున్న వారంతా అది నిజమని నమ్మలేదు. అయితే పదే పదే జరుగుతుండటంతో ఆశ్చర్యపోయారు. కుటుంబసభ్యులు భయపడి, ఆమెను మరోసారి ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆసుపత్రిలో చేరిన కొద్దిసేపటికే ఆ మహిళ మళ్ళీ చనిపోయింది. అయితే, ప్రపంచంలో ఇలాంటి కేసు వెలుగులోకి రావడం ఇదే మొదటిసారి కాదు. గత సంవత్సరం ఫిబ్రవరిలో కూడా ఒక మహిళ పోషకాహార లోపంతో ఆసుపత్రిలో చేరింది. వైద్యులు ఆమెను చనిపోయినట్లు ప్రకటించారు. కానీ స్మశానవాటికకు చేరుకున్న తర్వాత, ఆమె తిరిగి బతికింది.
మరిన్ని వీడియోల కోసం :
ఊరందరికి స్నేహితుడిగా మారిన కొండముచ్చు.. వీడియో
జనావాసాల్లోకి సింహం.. కెన్యా పార్క్‌లో దారుణం.. వీడియో
ఆడ స్పైడర్‌ను ఆకర్షించేందుకు డ్యాన్స్..పడిపోయిందా ఒకే..! లేదంటే వీడియో
అంబానీ సంపద ఖర్చు చేయడానికి 555 ఏళ్లు !!
సంక్రాంతి రైళ్లు హౌస్ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
