Elephant: యువతి చెంప పగలగొట్టిన ఏనుగు.. అసలు ఏం జరిగిందంటే..?
జంతువులు చేసే అల్లరి చేష్టలు నవ్వులు తెప్పిస్తుంటాయి. కానీ కొన్ని సందర్భాల్లో ఆ సరదా పనులే ఇతరులను తీవ్రంగా ఇబ్బందిపెట్టేస్తాయి. తాజాగా ఇక్కడ ఓ ఏనుగు చేసిన పని అయ్యో పాపం అనిపిస్తుంది..
జంతువులు చేసే అల్లరి చేష్టలు నవ్వులు తెప్పిస్తుంటాయి. కానీ కొన్ని సందర్భాల్లో ఆ సరదా పనులే ఇతరులను తీవ్రంగా ఇబ్బందిపెట్టేస్తాయి. తాజాగా ఇక్కడ ఓ ఏనుగు చేసిన పని అయ్యో పాపం అనిపిస్తుంది.. అప్పటి వరకు ప్రశాంతంగా కనిపించిన ఏనుగుకు ఒక్కసారిగా కోపమొచ్చింది.. ఇంకేముంది తన ఎదురుగా ఉన్న అమ్మాయి చెంప పగలకొట్టింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది. వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ జూ కు వెళ్లిన కొందరు పర్యాటకులు ఏనుగును చూసేందుకు దాని దగ్గరు వచ్చారు. ఏనుగు కూడా ఎంతో ప్రశాంతంగా కనిపిస్తూ.. తొండం చాపుతూ వారి చేతులను పట్టుకుంది. అయితే అందరు ఏనుగు తొండాన్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్న సమయంలో అక్కడే ఉన్న ఓ యువతి ఏనుగును ఫోటో తీయాలనుకుంది. వెంటనే తన దగ్గర ఉన్న ఫోన్ తీసి ఏనుగును ఫోటో తీయడానికి ప్రయత్నించింది. దీంతో ఆ ఏనుగు వెంటనే కోపంతో ఆ అమ్మాయిని తొండంతో కొట్టింది. దీంతో ఆ అమ్మాయి చేతిలో ఉన్న ఫోన్ ఎగిరిపోయి కింద పడగా.. ఆ అమ్మాయిని పక్కనే ఉన్న మరో వ్యక్తి పట్టుకున్నాడు. అయితే కిందపడిపోయిన ఫోన్ తీసుకోవడానికి తెగ ప్రయత్నించింది ఆ ఏనుగు. దీంతో వెంటనే అప్రమత్తమైన అక్కడున్నవారు ఫోన్ తీసుకున్నారు. ఈ వీడియోను ఫెయిల్ ఆర్మీ అనే ట్విట్టర్ ఖాతాలో షేర్ చేయగా.. తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసిన నెటిజన్స్ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Rashmika Mandanna: క్రష్మిక క్రష్ ఎవరో చెప్పేసింది.. స్కూల్ డేస్ నుంచి అతనంటే చాలా ఇష్టం..!
Man dies in hotel: హోటల్‌లో ప్రేయసితో శృంగారం చేస్తూ వ్యక్తి మృతి.. ఏం జరిగిందంటే..?
Google Search: ఈ 3 విషయాలు గూగుల్‌లో సెర్చ్ చేయకండి.. చేస్తే జైలుకెళ్లడం కన్ఫమ్..!
Ratlam Temple: ఆ గుడికి వెళ్తే.. బంగారం ఫ్రీ..! భక్తులకు ప్రసాదంగా బంగారు, వెండి నాణాలు.. ఎక్కడంటే.?
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

