Tesla Robo: టెస్లా ఇంజినీర్‌పై రోబో దాడి.! బలంగా శరీరంపై గాయాలు చేసిన రోబో..
అమెరికాలోని టెస్లా ఫ్యాక్టరీలో ఓ ఇంజినీర్‌పై రోబో దాడి చేసింది. కార్ల తయారీలో సహాయ పడేందుకు రూపొందించిన రోబో- ఇంజినీర్‌ను గాయపరచింది. సాంకేతిక లోపాల వల్ల ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ఇంజినీర్కి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన ఆస్టిన్లోని గిగా టెక్సాస్ ఫ్యాక్టరీలో రెండేళ్ల క్రితం జరగగా ఆలస్యంగా తాజాగా వెలుగులోకి వచ్చింది.
అమెరికాలోని టెస్లా ఫ్యాక్టరీలో ఓ ఇంజినీర్‌పై రోబో దాడి చేసింది. కార్ల తయారీలో సహాయ పడేందుకు రూపొందించిన రోబో- ఇంజినీర్‌ను గాయపరచింది. సాంకేతిక లోపాల వల్ల ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ఇంజినీర్కి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన ఆస్టిన్లోని గిగా టెక్సాస్ ఫ్యాక్టరీలో రెండేళ్ల క్రితం జరగగా ఆలస్యంగా తాజాగా వెలుగులోకి వచ్చింది. గిగా టెక్సాస్ కార్ల ఉత్పత్తి పరిశ్రమలో అల్యూమినియం భాగాలను బిగించేందుకు రోబోను వినియోగిస్తున్నారు. అయితే, ఈ రోబోలో లోపం తలెత్తింది. దీంతో తనకు ప్రోగ్రామింగ్ చేసే సాఫ్ట్వేర్ ఇంజినీర్ పైనే దాడి చేసింది. పరిశ్రమలో ఉన్న మూడు రోబోలను ఆఫ్ చేస్తుండగా ఈ ఘటన జరిగింది. రోబో నుంచి తప్పించుకున్న ఇంజినీర్ ప్రమాదవశాత్తు పక్కన ఉన్న అల్యూమినియం భాగాలను కోసే యంత్రంలో పడిపోయాడు. తీవ్ర రక్తస్రావమైన ఇంజనీర్‌ను తోటి ఉద్యోగులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. తాజాగా విడుదలైన నివేదికలో ఈ విషయం బయటపడింది. దీని ప్రకారం గతేడాదిలో సగటున ప్రతి 21 మందిలో ఒకరు గాయపడినట్లు తేలింది. ఇది ఇతర పరిశ్రమల సగటు కన్నా చాలా ఎక్కువ అని నివేదిక పేర్కొంది. 2022లో కూడా పరిశ్రమలో భారీ పేలుడు జరిగిందని తెలిపింది. అయితే, ఈ ఘటనపై స్పందించేందుకు టెస్లా సంస్థ నిరాకరించింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.
అర్థరాత్రి రైడ్‌తో వణుకు పుట్టించిన మహిళా ఎమ్మెల్యే
గుర్రంపై బ్లింకిట్ డెలివరీ.. ఇదెక్కడి మాస్ రా మావా..
వీడు కన్నేసాడంటే.. గురి తప్పడు.. చిటికెలో పగలకొట్టేస్తాడు
ఫేస్ చూసి అమాయకుడనుకునేరు.. అసలు విషయం తెలిస్తే..
పునర్వికకు క్రౌడ్ ఫండింగ్ ద్వారా పునర్జన్మ
గురుకులంలో క్షుద్రపూజలు.. రోడ్డెక్కిన విద్యార్థినులు..
ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.. తెల్లారే సరికి పోలీస్ స్టేషన్ లో

