AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మోసపోయి.. పిచ్చివాడిలా మారి.. భిక్షాటన చేస్తూ 13 ఏళ్లకు వీడియో

మోసపోయి.. పిచ్చివాడిలా మారి.. భిక్షాటన చేస్తూ 13 ఏళ్లకు వీడియో

Samatha J
|

Updated on: Aug 31, 2025 | 8:18 PM

Share

పదమూడేళ్ళ క్రితం ఉపాధి కోసం గల్ఫ్ దేశానికి వెళ్లి అదృశ్యమయ్యాడు. కుటుంబానికి ఆసరాగా ఉందామని దేశం కాని దేశం వెళ్లి మోసపోయి పదమూడేళ్ళు పిచ్చివాడిగా తిరిగాడు. ఇక తిరిగి రాడనుకొని కుటుంబం కూడా ఆశలు వదిలేసుకుంది.మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం ఉప్పలింగాపూర్ వాసి కోనింటి కృష్ణ పదమూడేళ్ళ క్రితం పనికోసం దుబాయ్ కి వెళ్లి తప్పిపోయాడు.

మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం ఉప్పలింగాపూర్ వాసి కోనింటి కృష్ణ పదమూడేళ్ళ క్రితం పనికోసం దుబాయ్ కి వెళ్లి తప్పిపోయాడు. ఉపాధి దొరకక దిక్కుతోచని స్థితిలో భిక్షాటన చేస్తూ జీవనం సాగించాడు. ఆయన ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేకుండా పోయింది. కూలి పనులు చేసుకొని జీవించే కోనింటి కృష్ణ లక్ష్మి దంపతులకు ఒక కుమార్తె, ఒక కుమారుడు. పదమూడేళ్ళ క్రితం అప్పు చేసి ఏజెంట్ ద్వారా దుబాయ్ లో పరిశ్రమలోని పని చేయడానికి వెళ్ళాడు కృష్ణ. కొన్ని రోజులకే పరిశ్రమ నిర్వాహకుల ఇబ్బందులు భరించలేక పారిపోయాడు. వీధుల్లో భిక్షాటన చేస్తూ కడుపు నింపుకున్నాడు. భార్యకు ఫోన్ చేద్దామంటే స్థానిక భాష రాదు. ఇంటి యజమాని క్షేమ సమాచారం ఎంతకీ తెలియకపోవడంతో కూలి పనులు చేసుకుంటూనే లక్ష్మి పిల్లలను పెద్ద చేసింది. కుమార్తెకి పెళ్లి కూడా చేసింది. దుబాయ్ లో ఉంటున్న మెదక్ జిల్లా శివంపేట మండలం గోమా రాణికి చెందిన హనుమంత్ రెడ్డి ఓ రోజు స్నేహితులతో కలిసి హోటల్ కు వెళ్ళగా ఓ వ్యక్తి భిక్షాటన చేస్తూ కనిపించాడు. తెలుగులో మాట్లాడుతూ ఉండడంతో హనుమంత్ రెడ్డి అతన్ని పిలిచి పూర్తి వివరాలు సేకరించారు. ఆయన ఈ విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే సునీతారెడ్డి దృష్టికి తీసుకువెళ్ళారు. ఎమ్మెల్యే వెంటనే ఉప్పలింగాపూర్ లోని స్థానిక నాయకులతో మాట్లాడి కృష్ణ వివరాలను ధృవీకరించుకున్నారు. ఆ తర్వాత హనుమంత్ రెడ్డి పూర్తి బాధ్యత తీసుకున్నారు. దుబాయ్ లోని అధికారులతో మాట్లాడడమే కాకుండా తన సొంత డబ్బు సుమారు లక్ష రూపాయలకు పైగా ఖర్చు చేసి కృష్ణను స్వదేశానికి పంపేందుకు ఏర్పాట్లు చేశారు. ఆయన కృషి ఫలించి శుక్రవారం కృష్ణ తన సొంత గ్రామంలోనే అడుగుపెట్టాడు. సుదీర్ఘకాలం తర్వాత కృష్ణను చూసిన కుటుంబ సభ్యుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. కృష్ణ ఆయన కుటుంబ సభ్యులు తమకు సహాయం చేసిన హనుమంత్ రెడ్డికి అలాగే ఎమ్మెల్యే సునీతారెడ్డికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.

మరిన్ని వీడియోల కోసం :

ఏఐతో ఓ యూజర్‌ సంభాషణ.. షాక్‌తిన్న చాట్‌జీపీటీ.. ఏం జరిగిందంటే..

వింత ఘటన.. నీలం రంగులో గుడ్డు పెట్టిన నాటు కోడి వీడియో

17వ బిడ్డకు జన్మనిచ్చిన మహిళ.. ‘తల్లికి వందనం’ అమలు చేయాలంటూ డిమాండ్ వీడియో