AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తల్లి కాకముందు ఆరుగురు పిల్లల్ని కోల్పోయా.. సన్నీ లియోన్ వీడియో

తల్లి కాకముందు ఆరుగురు పిల్లల్ని కోల్పోయా.. సన్నీ లియోన్ వీడియో

Samatha J
|

Updated on: Aug 31, 2025 | 8:16 PM

Share

బాలీవుడ్ నటి సన్నీలియోన్ ప్రస్తుతం ముగ్గురు పిల్లలకు తల్లిగా సంతోషకరమైన జీవితం గడుపుతున్నారు. ఈ మాతృత్వపు ఆనందం తనకు అంత సులభంగా దక్కలేదని దీని వెనుక ఎన్నో కన్నీళ్లు చెప్పలేని బాధ ఉందని ఆమె తొలిసారిగా బయట పెట్టారు. పెంపుడు కుతురు నిషా తన జీవితంలోకి రాకముందు సరోగేసీ ద్వారా ఆరుగురు పిల్లలను కోల్పోయినట్లు తెలిపి అందరినీ భావోద్వేగానికి గురిచేశారు. నటి సోహా అలీఖాన్ నిర్వహించిన ఒక పాడ్ కాస్ట్లో పాల్గొన్న సన్నీలియోన్ తన వ్యక్తిగత జీవితంలోని విషాదకరమైన అధ్యాయాన్ని పంచుకున్నారు. పిల్లల కోసం తాను తన భర్త డేనియల్ వెబర్ ఎంతగానో ప్రయత్నించామని సరోగేసీని ఆశ్రయించామని తెలిపారు.

తమకు నలుగురు అమ్మాయిలు ఇద్దరు అబ్బాయిలు పుట్టాల్సిందే. కానీ ఆ ప్రయత్నాలు ఫలించలేదని అన్నారు. ఒక్కసారి గర్భం దాల్చినట్లు తెలిసినా అందులో పిండం పెరగడం లేదని వైద్యులు చెప్పారని ఆ వార్త తమను తీవ్రంగా నిరాశపరిచిందని సన్నీలియోన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆ సమయంలో తాము ఎంతో మానసిక క్షోభను అనుభవించామని గుర్తుచేసుకున్నారు. తాము ఏమైనా తప్పు చేశామా దేవుడికి తమంటే ఇష్టం లేదా తమకే ఎందుకు ఇలా జరుగుతుందే అని ప్రతిరోజూ బాధపడేవాళ్ళమని ఆ సమయంలోనే ఒక పాపను దత్తత తీసుకోవాలనే ఆలోచన వచ్చిందని ఆమె వివరించారు. నలుగురు అమ్మాయిలను కోల్పోతున్న సమయంలోనే తాము దత్తత కోసం దరఖాస్తు చేసుకున్నామని సన్నీలియోన్ తెలిపారు. అలా తమ జీవితంలోకి నిషా వచ్చిందని ఆమె తమను తల్లిదండ్రులుగా ఎంచుకుందని తాము నమ్ముతామని చెప్పారు. నిషాను మొదటిసారి చూసినప్పుడు తన వయసు 18 నెలలు కానీ చూడటానికి ఏడాది పాపలా ఉండేదని ఆమెను తాను చూడగానే ఇ తన బిడ్డ అనే బలమైన భావన కలిగిందని చెప్పుకొచ్చారు. ఆ క్షణం నుంచి తను తమ సొంతమైందని సన్నీలియోన్ సంతోషం వ్యక్తం చేశారు. సన్నీలియోన్ దంపతులు 2017లో నిషాను దత్తత తీసుకున్నారు. ఆ తర్వాత 2018లో సరోగేసీ ద్వారా నోవా ఆషర్ అనే కవలల అబ్బాయిలకు జన్మనిచ్చారు.

మరిన్ని వీడియోల కోసం :

ఏఐతో ఓ యూజర్‌ సంభాషణ.. షాక్‌తిన్న చాట్‌జీపీటీ.. ఏం జరిగిందంటే..

వింత ఘటన.. నీలం రంగులో గుడ్డు పెట్టిన నాటు కోడి వీడియో

17వ బిడ్డకు జన్మనిచ్చిన మహిళ.. ‘తల్లికి వందనం’ అమలు చేయాలంటూ డిమాండ్ వీడియో