Stalin Tamil Nadu CM: 68 ఏళ్ల వయసులోనూ సీఎం స్టాలిన్‌ ఇంత ఫిట్‌గా ఉండడానికి కారణం ఇదేనా? వైరల్‌ అవుతోన్న వీడియో.

Stalin Tamilnadu CM: దేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి కురుణానిధి కుమారుడు స్టాలిన్‌ ప్రస్తుత రాజకీయాల్లో తనదైన ముద్ర వేస్తోన్న విషయం తెలిసిందే. ఇటీవల జరిగిన తమిళనాడు ఎన్నికల్లో అనూహ్య విజయాన్ని సొంతం చేసుకున్న స్టాలిన్...

Stalin Tamil Nadu CM: 68 ఏళ్ల వయసులోనూ సీఎం స్టాలిన్‌ ఇంత ఫిట్‌గా ఉండడానికి కారణం ఇదేనా? వైరల్‌ అవుతోన్న వీడియో.
Stalin Work Out

Updated on: Jul 02, 2021 | 8:26 AM

Stalin Tamil Nadu CM: దేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి కురుణానిధి కుమారుడు స్టాలిన్‌ ప్రస్తుత రాజకీయాల్లో తనదైన ముద్ర వేస్తోన్న విషయం తెలిసిందే. ఇటీవల జరిగిన తమిళనాడు ఎన్నికల్లో అనూహ్య విజయాన్ని సొంతం చేసుకున్న స్టాలిన్ దేశం దృష్టిని ఆకర్షించారు. ఇక గత ప్రభుత్వంలో ఉన్న క్యాంటిన్లను అదే పేరుతో కొనసాగిస్తూ.. ‘అది మంచి పని కాబట్టి దానిని అలాగే కొనసాగించాలని’ నిర్ణయం తీసుకోవడంతో అందరి ప్రశంసలు పొందారు స్టాలిన్‌. ఇక రాజకీయాల్లో ఎంత బిజీగా ఉన్నా ఆరోగ్యానికి పెద్ద పీట వేస్తారు స్టాలిన్‌. ఈ క్రమంలోనే తన శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి నిత్యం వర్కవుట్‌లు చేస్తుంటారు.

68 ఏళ్ల వయసులోనూ బక్క పలచని శరీరంతో, యాక్టివ్‌గా కనిపించే స్టాలిన్ హెల్త్‌ సీక్రెట్‌ కూడా క్రమం తప్పకుండా వ్యాయామం చేయడమే. ఇప్పుడు ఇదంతా ఎందుకనేగా.. ముఖ్యమంత్రిగా బిజీగా ఉన్న సమయంలోనూ స్టాలిన్‌ వ్యాయామాన్ని మాత్రం పక్కన పెట్టలేదు. ఇంట్లో ఏర్పాటు చేసుకున్న జిమ్‌లో వర్కవుట్లు చేస్తున్నారు. తాజాగా దీనికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇంత వయసులోనూ ఫిట్‌నెస్‌కు అంతలా ప్రాధాన్యమిస్తోన్న సీఎం స్టాలిన్‌ యూత్‌కు ఆదర్శంగా నిలుస్తున్నారు. నెట్టింట వైరల్‌గా మారిన వీడియోపై మీరూ ఓ లుక్కేయండి..

Also Read: Hyderabad Metro Timings: మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇక పరుగుల సమయం మారింది.. గమనించారా..

Princess Diana Statue: ప్రిన్సెస్ డయానా విగ్రహం ఆవిష్కరణ; ప్రిన్స్ విలియం, హ్యారీలపైనే అందరి ఆసక్తి..!

AHA OTT: ఈ వీకెండ్‌ ‘ఆహా’తో చిల్‌ అవ్వండి.. ఏకే రోజు 15 సినిమాలు. ‘లైఫ్‌లో ఎంటర్‌టైన్‌మెంట్‌ ఉండాలి కదండి’.