పెళ్లి ఊరేగింపులో గుర్రం ఎక్కాడని.. వరుడిపై రాళ్లదాడి !!

పెళ్లి ఊరేగింపులో గుర్రం ఎక్కాడని.. వరుడిపై రాళ్లదాడి !!

Phani CH

|

Updated on: Jun 10, 2023 | 10:01 AM

పెళ్లిలో బరాత్‌ ఒక కీలక ఘట్టం. పెళ్లి రోజు సాయంత్రం బ్యాండ్ బాజాలు, బంధువులు,స్నేహితుల ఆకట్టుకునే డ్యాన్సులతో కోలాహలంగా ఈ వేడుక నిర్వహిస్తుంటారు. కొన్ని ప్రాంతాల్లోనైతే బారాత్‌లో పెళ్లికొడుకును గుర్రంపై ఊరేగిస్తుంటారు. తాజాగా మధ్యప్రదేశ్‌లో జరిగిన పెళ్లి బారాత్‌లో ఊహించని ఘటన..

పెళ్లిలో బరాత్‌ ఒక కీలక ఘట్టం. పెళ్లి రోజు సాయంత్రం బ్యాండ్ బాజాలు, బంధువులు,స్నేహితుల ఆకట్టుకునే డ్యాన్సులతో కోలాహలంగా ఈ వేడుక నిర్వహిస్తుంటారు. కొన్ని ప్రాంతాల్లోనైతే బారాత్‌లో పెళ్లికొడుకును గుర్రంపై ఊరేగిస్తుంటారు. తాజాగా మధ్యప్రదేశ్‌లో జరిగిన పెళ్లి బారాత్‌లో ఊహించని ఘటన పెళ్లికొడుకుకి తీరని ఆవేదన ఆందోళన మిగిల్చింది. ఛతర్‌పూర్ జిల్లాలో ఓ దళిత యువకుడి పెళ్లి ఊరేగింపుపై రాళ్లదాడి జరిగింది. ఆధిపత్య కులంగా భావిస్తున్న ఓ వర్గానికి చెందిన కొందరు స్థానికులు ఈ దాడికి పాల్పడ్డారు. బంధువులు, స్నేహితుల మధ్య కోలాహలంగా పెళ్లికొడుకు వధువు ఇంటికి గుర్రంపై బయల్దేరాడు. ఊరేగింపు ఊరి మధ్యలోకి రాగానే అక్కడే ఉన్న నిందితులు వరుడిపై రాళ్లదాడికి దిగారు. పోలీసులు అక్కడే ఉన్నా పట్టించుకోకుండా రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో ముగ్గురు పోలీసులు కూడా గాయపడ్డారు. దాడికి పాల్పడిన 50 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

గొంతులో కత్తితోనే బైక్‌పై కిలోమీటరు ప్రయాణించి ఆసుపత్రిలో చేరిన ధీశాలి

ఆడవాళ్లా మజాకా !! మెట్రోలో డిష్యూం డిష్యూం !!

రైలు పట్టాలకు రాళ్లు కట్టిన బాలుడు.. తప్పిన పెను ప్రమాదం

మహాప్రభో నాకు పెళ్ళాం కావాలి అంటూ తహసీల్దార్‌కు దరఖాస్తు.. కండిషన్స్ అప్లై..

పేరెంట్స్‌ వెడ్డింగ్‌ వీడియో చూసి ఆ చిన్నారి ఏమన్నాడో తెలుసా ??