గొంతులో కత్తితోనే బైక్‌పై కిలోమీటరు ప్రయాణించి ఆసుపత్రిలో చేరిన ధీశాలి
మహారాష్ట్రలోని నవీముంబైలో 30 ఏళ్ల యువ వ్యాపారవేత్తపై అతడి తమ్ముడు దాడిచేశాడు. తుప్పు పట్టిన కత్తిని అతడి గొంతులో దించేశాడు. కత్తి గొంతులో దిగినా ఏమాత్రం బెదిరిపోని బాధితుడు గొంతులో కత్తితోనే బైక్‌పై కిలోమీటరు దూరం ప్రయాణించి ఆసుపత్రిలో చేరాడు. అదృష్టవశాత్తు అతడిప్పుడు కోలుకుంటున్నాడు.
మహారాష్ట్రలోని నవీముంబైలో 30 ఏళ్ల యువ వ్యాపారవేత్తపై అతడి తమ్ముడు దాడిచేశాడు. తుప్పు పట్టిన కత్తిని అతడి గొంతులో దించేశాడు. కత్తి గొంతులో దిగినా ఏమాత్రం బెదిరిపోని బాధితుడు గొంతులో కత్తితోనే బైక్‌పై కిలోమీటరు దూరం ప్రయాణించి ఆసుపత్రిలో చేరాడు. అదృష్టవశాత్తు అతడిప్పుడు కోలుకుంటున్నాడు. కత్తితో ఆసుపత్రికి వచ్చిన తేజస్ పాటిల్‌ను చూసి షాకైన ఎంపీసీటీ వైద్యులు ఆ వెంటనే తేరుకుని అవసరమైన వైద్య పరీక్షలు చేశారు. ఆ తర్వాత నాలుగు గంటలు కష్టపడి శస్త్రచికిత్స ద్వారా గొంతు నుంచి కత్తిని తొలగించారు. ప్రాణాపాయం తప్పడంతో అతడిని సాధారణ వార్డుకు తరలించారు. కుటుంబ కలహాల నేపథ్యంలో తేజస్ పాటిల్‌పై అతడి తమ్ముడు హత్యాయత్నానికి పాల్పడ్డాడు. తమ్ముడికి మద్యం తాగే అలవాటు ఉందని, స్నేహితుడితో వచ్చి తనపై దాడిచేశాడని తేజస్ పాటిల్ తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. తన గొంతులో కత్తి గుచ్చుకున్నా ఎలాంటి భయాందోళనలు లేకుండా ఆసుపత్రికి రావాలన్న తేజస్ స్పృహకు ఆసుపత్రి వైద్యులు ప్రశంసలు కురిపించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఆడవాళ్లా మజాకా !! మెట్రోలో డిష్యూం డిష్యూం !!
రైలు పట్టాలకు రాళ్లు కట్టిన బాలుడు.. తప్పిన పెను ప్రమాదం
మహాప్రభో నాకు పెళ్ళాం కావాలి అంటూ తహసీల్దార్‌కు దరఖాస్తు.. కండిషన్స్ అప్లై..
పేరెంట్స్ వెడ్డింగ్ వీడియో చూసి ఆ చిన్నారి ఏమన్నాడో తెలుసా ??
ఎడారిలా మారిన లక్నవరం సరస్సు !! నిరాశలో సందర్శకులు
పుతిన్ వెంట 'మలం' సూట్‌కేసు..ఎందుకో తెలుసా ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు

