రైలు పట్టాలకు రాళ్లు కట్టిన బాలుడు.. తప్పిన పెను ప్రమాదం

రైలు పట్టాలకు రాళ్లు కట్టిన బాలుడు.. తప్పిన పెను ప్రమాదం

Phani CH

|

Updated on: Jun 10, 2023 | 9:58 AM

ఒడిశా బాలాసోర్ జిల్లాలో కోరమండల్ ఎక్స్‌ప్రెస్‌ సృష్టించిన బీభత్సం ఇంకా కళ్ల ముందు కదలాడుతోంది. వందలాది మంది ప్రాణాలు పోయిన ఘటనపై కారణాలు, బాధ్యులు ఎవరనే విషయం ఇంకా తేలనే లేదు. ఇంతో మరో పెనుప్రమాదం సృష్టించబోయాడు ఓ మైనర్‌ బాలుడు. ప్రస్తుతం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

ఒడిశా బాలాసోర్ జిల్లాలో కోరమండల్ ఎక్స్‌ప్రెస్‌ సృష్టించిన బీభత్సం ఇంకా కళ్ల ముందు కదలాడుతోంది. వందలాది మంది ప్రాణాలు పోయిన ఘటనపై కారణాలు, బాధ్యులు ఎవరనే విషయం ఇంకా తేలనే లేదు. ఇంతో మరో పెనుప్రమాదం సృష్టించబోయాడు ఓ మైనర్‌ బాలుడు. ప్రస్తుతం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. కర్నాటకలో రైలు పట్టాలపై రాళ్లు పెట్టాడో మైనర్ బాలుడు. ఒకటి రెండు కాదు ఏకంగా కిలో మీటర్‌ మేర పట్టాలపై వరుసగా రాళ్లు పేర్చాడు. ఆ ట్రాక్‌పై ట్రైన్‌ కనుక వెళ్తే ఖచ్చితంగా పట్టాలు తప్పి పెను ప్రమాదమే జరిగేది. పట్టాలపై రాళ్లు పేర్చడమే కాదు.. కొన్ని చోట్ల పట్టాలకు రాళ్లను తాళ్లతో కట్టాడు. బాలుడు అలా రాళ్లు కడుతుండగా అక్కడున్న ఓ వ్యక్తి చూశాడు. వెంటనే బాలుడ్ని పట్టుకొని, ఎందుకు రైలు పట్టాలపై రాళ్లు కడుతున్నావు?ఎవరు నిన్ను ఈ పని చేయమన్నారని నిలదీశాడు. అందుకు బాలుడు తనకెవరూ చెప్పలేదని, తెలియక చేశానని, ఇంకెప్పుడూ ఇలా చేయనని కాళ్లు పట్టుకొని వేడుకున్నాడు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మహాప్రభో నాకు పెళ్ళాం కావాలి అంటూ తహసీల్దార్‌కు దరఖాస్తు.. కండిషన్స్ అప్లై..

పేరెంట్స్‌ వెడ్డింగ్‌ వీడియో చూసి ఆ చిన్నారి ఏమన్నాడో తెలుసా ??

ఎడారిలా మారిన లక్నవరం సరస్సు !! నిరాశలో సందర్శకులు

తాత ఆపరేషన్ డబ్బులతో ఆన్‌లైన్‌ గేమ్‌ ఆడి.. చివరికి ??

కోట్ల విలువైన కారులో చాయ్‌ దుకాణమా !! కస్టమర్స్‌ను ఆకట్టుకోడానికి నయా టెక్నిక్‌