కోట్ల విలువైన కారులో చాయ్ దుకాణమా !! కస్టమర్స్‌ను ఆకట్టుకోడానికి నయా టెక్నిక్
సోషల్ మీడియాలో చాలా రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. ఆ మధ్య.. ఎంబీఏ చాయ్‌వాలా, బీటెక్ చాయ్‌వాలా అని కొందరు యువతీ యువకులు ఉద్యోగం కోసం చూడకుండా తమ డిగ్రీనే పేరుగా మార్చుకొని స్వయం ఉపాధి కల్పించుకున్నారు. అందుకు సంబంధించిన వీడియోలు కూడా నెట్టింట చాలానే వైరల్ అయ్యాయి.
సోషల్ మీడియాలో చాలా రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. ఆ మధ్య.. ఎంబీఏ చాయ్‌వాలా, బీటెక్ చాయ్‌వాలా అని కొందరు యువతీ యువకులు ఉద్యోగం కోసం చూడకుండా తమ డిగ్రీనే పేరుగా మార్చుకొని స్వయం ఉపాధి కల్పించుకున్నారు. అందుకు సంబంధించిన వీడియోలు కూడా నెట్టింట చాలానే వైరల్ అయ్యాయి. ఇప్పుడు ఓ యువకుడు మరో అడుగు ముందుకేసి, ఆడి చాయ్‌వాలా అంటూ వచ్చాడు. ఇందులో విలాసవంతమైన ఇంట్లో ఉంటున్న ఓ వ్యక్తి వేలకోట్ల రూపాయల విలువైన కారులో వచ్చి టీ అమ్ముతున్నాడు. తన చేతులతో టీ తయారు చేసి కస్టమర్లకు అందిస్తున్న వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. ఈ వీడియోలో ఒక వ్యక్తి ఓ విలాసవంతమైన ఇంటి ఆడి కారులో బయలుదేరాడు. అతనేదో కార్పొరేట్ ఆఫీసుకో వెళ్తున్నాడని అనుకుంటే పొరపాటే. అతను ముంబైలోని లోఖండ్‌వాలా బ్యాక్‌రోడ్‌లో అతని టీ స్టాల్ ఉంది. అతనే స్వయంగా టీ తయారుచేసి అమ్ముతుంటాడు. అవును.. నమ్మశక్యంగా లేదు కదా.. అవును మరి ఆడి కారలో వచ్చి రోడ్డుపక్కన చాయ్ అమ్ముతాడంటే ఎలా నమ్ముతారులెండి. కానీ ఇది నిజం. నివేదికల ప్రకారం, అమిత్ కశ్యప్. మన్ను శర్మ అనే ఇద్దరు వ్యక్తులు ఆడి చాయ్‌వాలా పేరుతో టీ స్టాల్‌ను ప్రారంభించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఎండలకు తట్టుకోలేక సెలైన్ బాటిల్స్ ఎత్తుకెళ్లిన కోతులు !!
అమ్మప్రేమకు లేదుసాటి.. మనిషైనా.. జంతువైనా.. నెట్టింట వైరల్ అవుతున్న క్యూట్ వీడియో
గుండెపోటు.. ఆరోజే ఎందుకు వస్తోంది ?? అధ్యయనాలు ఏం చెబుతున్నాయి ??
తుపాకులు వదిలి.. క్యాట్‌వాక్ చేసిన మాజీ మహిళా నక్సలైట్లు
ఇనుప రాడ్లతో బద్దలుకొట్టారు..గునపాలతో తవ్వారు.. కానీ వల్ల కాలేదు
ఓర్నీ.. దేవుడికే టోకరానా.. కొండగట్టు హుండీలో కానుకగా డమ్మీ నోట్లు
మీ ఇంట సిరులు కురిపించే మొక్క!
వాహనదారులకు షాక్.. వితంతువులు, అనాథల పేరుతో కొత్త సెస్!
ఆర్థిక సలహాల కోసం ఏఐని వాడుతున్నారా? డేంజర్ బెల్స్ మోగినట్టే
వర్షం వస్తే చాలు డబ్బే.. డబ్బు..

