ఎండలకు తట్టుకోలేక సెలైన్ బాటిల్స్ ఎత్తుకెళ్లిన కోతులు !!
అసలే ఎండాకాలం.. ఎండలు మండిపోతున్నాయి. ఇటు మనుషులు, అటు పశుపక్ష్యాదులు నీటికోసం అల్లాడుతున్న పరిస్థితులు. మరోవైపు అడవుల్లో నీళ్లు దొరక్క వన్యప్రాణులు గ్రామాల్లోకి చొరబడుతున్నాయి. నానా బీభత్సం చేస్తున్నాయి. తాజాగా అల్లూరి జిల్లాలో కోతులు బీభత్సం సృష్టించాయి.
అసలే ఎండాకాలం.. ఎండలు మండిపోతున్నాయి. ఇటు మనుషులు, అటు పశుపక్ష్యాదులు నీటికోసం అల్లాడుతున్న పరిస్థితులు. మరోవైపు అడవుల్లో నీళ్లు దొరక్క వన్యప్రాణులు గ్రామాల్లోకి చొరబడుతున్నాయి. నానా బీభత్సం చేస్తున్నాయి. తాజాగా అల్లూరి జిల్లాలో కోతులు బీభత్సం సృష్టించాయి. దేవీపట్నం మండలం ఇందుకూరుపేట ప్రభుత్వ ఆస్పత్రిపై వానరమూక దండెత్తింది. ఆస్పత్రిలోకి ప్రవేశించి నానా రచ్చ చేశాయి. అక్కడి సెలైన్ బాటిళ్లను ఎత్తుకెళ్లిపోయాయి. కోతులను తరిమేందుకు ప్రయత్నించిన ఆస్పత్రి సిబ్బందిపై కోతులు ఎదురుదాడికి యత్నించడంతో తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ప్రతి రోజూ కోతులు ఆస్పత్రిలో నానా రచ్చ చేస్తున్నాయని, తరమబోతే దాడికి పాల్పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణం అధికారులు స్పందించి కోతుల బెడదనుంచి ఆస్పత్రిని, సిబ్బందిని కాపాడాలని, తగిన చర్యలు తీసుకోవాలని ఆస్పత్రి సిబ్బంది విజ్ఞప్తి చేస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అమ్మప్రేమకు లేదుసాటి.. మనిషైనా.. జంతువైనా.. నెట్టింట వైరల్ అవుతున్న క్యూట్ వీడియో
గుండెపోటు.. ఆరోజే ఎందుకు వస్తోంది ?? అధ్యయనాలు ఏం చెబుతున్నాయి ??