క్రమం తప్పకుండా గుడికి వెళ్తున్న కోతి.. శివునికి మొక్కుతూ..

క్రమం తప్పకుండా గుడికి వెళ్తున్న కోతి.. శివునికి మొక్కుతూ..

Phani CH

|

Updated on: Jan 10, 2023 | 9:21 AM

ఉత్తరప్రదేశ్‌లో విచిత్ర సంఘటన జరిగింది. లక్నోలోని శ్రీ బుద్ధేశ్వర్‌ మహదేవ్‌ ఆలయంలో ఓ వానరం శివునికి మొక్కుతూ కనిపించింది. అచ్చం మనిషిలా సాష్టాంగ నమస్కారం చేస్తున్న ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.

ఉత్తరప్రదేశ్‌లో విచిత్ర సంఘటన జరిగింది. లక్నోలోని శ్రీ బుద్ధేశ్వర్‌ మహదేవ్‌ ఆలయంలో ఓ వానరం శివునికి మొక్కుతూ కనిపించింది. అచ్చం మనిషిలా సాష్టాంగ నమస్కారం చేస్తున్న ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియోలో లక్నోలోని శ్రీ బుద్ధేశ్వర్ మహాదేవ్ ఆలయం వైపు ఓ వానరం వెళ్తోంది. అలా వెళ్తున్న కోతిని చుట్టుపక్కల ఉన్న జనం గమనిస్తూనే ఉన్నారు. అయినా ఆ వానరం వారెవరినీ పట్టించుకోకుండా మహాదేవుడ్ని దర్శించుకోడానికి నేరుగా గుడి మెట్లు ఎక్కి ఆలయం లోపలికి వెళ్లింది. ఆలయ ప్రాంగణంలోకి చేరుకోగానే అక్కడ కనిపించిన పరశురాముని విగ్రహానికి రెండు చేతులూ జోడించి నమస్కరించింది. తర్వాత ఆలయం లోపలికి వెళ్లింది. అలా వెళ్తున్న కోతిని చూసి అక్కడే ఉన్న ఓ కుక్క దానిని బెదిరిస్తూ మొరిగింది. దీంతో కొంచెం సేపు ఆగి.. చూడూ.. నేను నా స్వామిని దర్శించుకోడానికి వచ్చాను.. నువ్వు మధ్యలో అడ్డుపడకు.. అన్నట్టుగా కుక్కను తరిమివేసి.. వానరం మరొక ఆలయ ద్వారం వైపు వెళ్లింది. అక్కడ శివుని గుడి ముందు ముకుళిత హస్తాలతో తల వంచుకుని ప్రార్ధించింది. వైరల్ అవుతున్న ఈ వీడియో నెటిజన్లను విస్మయానికి గురి చేస్తోంది. నెటిజన్లు వానరంపై ఎడతెగని ప్రేమను, ప్రశంసలను కురిపిస్తున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

హోటల్‌కు వెళ్లి బిర్యానీ ఆర్డర్‌ చేసిన వ్యక్తి.. ప్లేట్‌లో కనిపించింది చూసి షాక్‌..

ఇప్పుడే ఇలా ఉంటే.. పెళ్లయ్యాక వరుడి పరిస్థితికి జాలిపడుతున్న నెటిజన్లు..

Published on: Jan 10, 2023 09:21 AM