హోటల్‌కు వెళ్లి బిర్యానీ ఆర్డర్ చేసిన వ్యక్తి.. ప్లేట్‌లో కనిపించింది చూసి షాక్..
మధ్యప్రదేశ్‌కు చెందిన ఆకాష్ అనే వ్యక్తి మంచి ఆకలిమీద రెస్టారెంట్‌కి వెళ్లాడు. అక్కడ వెజ్ బిర్యానీ ఆర్డర్ చేశాడు. విపరీతమైన ఆకలితో ఉన్న ఆ వ్యక్తి బిర్యానీ ఎప్పుడు వస్తుందా ఎప్పుడు తిందామా అని టేబుల్ దగ్గర ఆత్రంగా ఎదురు చూస్తున్నాడు.
మధ్యప్రదేశ్‌కు చెందిన ఆకాష్ అనే వ్యక్తి మంచి ఆకలిమీద రెస్టారెంట్‌కి వెళ్లాడు. అక్కడ వెజ్ బిర్యానీ ఆర్డర్ చేశాడు. విపరీతమైన ఆకలితో ఉన్న ఆ వ్యక్తి బిర్యానీ ఎప్పుడు వస్తుందా ఎప్పుడు తిందామా అని టేబుల్ దగ్గర ఆత్రంగా ఎదురు చూస్తున్నాడు. ఇంతలో వేడి వేడి పొగలు కక్కుతూ బిర్యానీ ప్లేట్ అతని ముందు ప్రత్యక్షమైంది. ఓ పట్టుపడదామని రెడీ అయిన అతను బిర్యానీలో కనిపించింది చూసి ఒక్కసారిగా షాకయ్యాడు. అసలే ఆకలిమీదున్నాడేమో కోపం నషాళానికెక్కింది. వెజ్ బిర్యానీలో చికెన్ బోన్ కనిపించడంతో వెంటనే సిబ్బంది, హోటల్ మేనేజర్‌కు ఫిర్యాదు చేశాడు. అంతేకాదు రెస్టారెంట్ యజమానిపై పోలీసులకు ఫిర్యాదు కూడా చేశాడు. అయితే హోటల్ యాజమాన్యం అతనికి క్షమాపణ చెప్పింది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో జరిగింది. కానీ సిబ్బంది నిర్లక్ష్యంపై ఆకాష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు 298 సెక్షన్ కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు తెలిపారు. ఈ ఘటనపై విచారణ జరుగుతోందని, ఆ తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ సంపత్ ఉపాధ్యాయ్ తెలిపారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఇప్పుడే ఇలా ఉంటే.. పెళ్లయ్యాక వరుడి పరిస్థితికి జాలిపడుతున్న నెటిజన్లు..
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్‌గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

