EMI Hotel: ముందు తినండి.. తర్వాతే డబ్బులివ్వండి.. అదీ ఈఎంఐ లోనే..

EMI Hotel: ముందు తినండి.. తర్వాతే డబ్బులివ్వండి.. అదీ ఈఎంఐ లోనే..

Phani CH

| Edited By: Janardhan Veluru

Updated on: Apr 15, 2023 | 1:05 PM

వేసవి అంటేనే మండే ఎండలతోపాటు నోరూరించే మామిడిపళ్లు కూడా గుర్తుకొస్తాయి. ఏప్రిల్‌ మొదటి వారంలోనే మార్కెట్‌లో రకరకాల మామిడిపళ్లు రారమ్మంటూ ఆహ్వానం పలుకుతున్నాయి.

వేసవి అంటేనే మండే ఎండలతోపాటు నోరూరించే మామిడిపళ్లు కూడా గుర్తుకొస్తాయి. ఏప్రిల్‌ మొదటి వారంలోనే మార్కెట్‌లో రకరకాల మామిడిపళ్లు రారమ్మంటూ ఆహ్వానం పలుకుతున్నాయి. డిమాండ్ ఎక్కువగా ఉండడం, దానికి తగ్గట్లుగా సప్లై లేకపోవడంతో ధరలు కూడా విపరీతంగా ఉన్నాయి. అందులోనూ అల్ఫాన్సా రకం మామిడి పండ్ల రేటు మరీ ఎక్కువ. అందుకే ఆ పళ్లను చూడగానే మనసులాగినా.. రేటు చూసేసరికి వెనకడుగు వేస్తుంటారు వినియోగదారులు. అలాంటివారికోసం ఓ బంపరాఫర్‌తో ముందుకొచ్చారు ఓ వ్యాపారి. మామిడిపళ్ల ప్రియుల కోసం మహారాష్ట్రలోని ఓ వ్యాపారి ‘ముందు తినండి.. ఆ తర్వాతే డబ్బులివ్వండంటూ’ సరికొత్త ఆఫర్ తో ముందుకొచ్చాడు. మామిడి ప్రియులకు ఈఎంఐ సౌకర్యం కల్పించాడు. క్రెడిట్‌ కార్డ్‌ ద్వారా కూడా మామిడిపళ్లు కొనుక్కోవచ్చట. తమ దుకాణంలో 5 వేలకు పైగా విలువైన మామిడి పండ్లు కొంటే క్రెడిట్ కార్డుతో ఈఎంఐ పద్ధతిలో చెల్లించవచ్చని అంటున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అర్ధరాత్రి తలుపుతట్టిన శబ్ధం.. డోర్‌ ఓపెన్‌ చేయగా షాక్‌ !!

ఇల్లు అమ్మి మరీ ఉచితంగా హెల్మెట్ల పంపిణీ !! కారణం ఇదే

ఆదర్శగురువు.. కొబ్బరినూనె తెచ్చి స్టూడెంట్స్‌ తలలకు రుద్దిన టీచర్‌ !! ఎందుకో తెలుసా ??

Allu Arha: మాటల యుద్దం.. అందర్నీ ఫిదా చేస్తున్న అర్హ..

Pushpa 2: ఏకంగా 100 మిలియన్లు వైపు.. దిమ్మతిరిగేలా చేస్తున్న పుష్ప

 

Published on: Apr 15, 2023 01:00 PM