illicit relationship: పరాయి స్త్రీతో అడ్డంగా దొరికిపోయిన ఎస్ఐ.. ఉతికి ఆరేసిన భార్య.!

illicit relationship: పరాయి స్త్రీతో అడ్డంగా దొరికిపోయిన ఎస్ఐ.. ఉతికి ఆరేసిన భార్య.!

Anil kumar poka

|

Updated on: Apr 15, 2023 | 7:56 PM

ఇటీవల కాలంలో విలాసాలకు అలవాటు పడ్డ కొంతమంది వివాహేతర సంబంధాలతో పచ్చని కాపురంలో నిప్పులు పోసుకుంటున్నారు. తాజాగా ఓ పోలీసు అధికారి తప్పుటడుగులు వేసి అడ్డంగా బుక్కయ్యాడు.

ఇటీవల కాలంలో విలాసాలకు అలవాటు పడ్డ కొంతమంది వివాహేతర సంబంధాలతో పచ్చని కాపురంలో నిప్పులు పోసుకుంటున్నారు. తాజాగా ఓ పోలీసు అధికారి తప్పుటడుగులు వేసి అడ్డంగా బుక్కయ్యాడు. నెల్లూరు జిల్లా కేంద్రంలోని పోస్టల్ కాలనీలో ఏఆర్ ఎస్.ఐ. వాసు.. భార్య చేతిలో చావుదెబ్బలు తిన్నాడు. తనను కాదని, మరో మహిళతో కలిసి వున్న భర్తను చితకబాదేసింది. గత కొన్నేళ్లుగా మొదటి భార్య సామ్రాజ్యంతోపాటు తన పిల్లలకు దూరంగా ఉంటున్నాడు ఎఆర్ ఎస్ఐ వాసు. గుంటూరుకు చెందిన వాసు దంపతులకు 30 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు. కొడుకు, కూతురు. 2017 నుంచి భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు ఏర్పడ్డాయి. 2018లో తన భర్త మౌనిక అనే మహిళతో సహాజీవనం చేస్తున్నాడని మొదటి భార్య ఆరోపిస్తోంది. అప్పటినుంచి ఆమెతోనే కలిసి ఉంటున్నాడని, తనను నిర్లక్ష్యం చేస్తున్నాడని వాసు భార్య సామ్రాజ్యం మండిపడుతోంది. ఈ క్రమంలోనే నెల్లూరులో కాపురం పెట్టాడని తెలుసుకుని కుటుంబసభ్యులతో కలిసి దాడి చేసింది సామ్రాజ్యం. మహిళతో వాసును రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకొని చితక బాదారు. తన భర్త తనకు కావాలని సామ్రాజ్యం డిమాండ్ చేస్తోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Lati Charge on Allu Arjun Fans: అర్థరాత్రి పోలీసోళ్లకు చుక్కలే..! ఏమాత్రం తగ్గని బన్నీ ఫ్యాన్స్..

Allu Arjun Vibrant Look: ఉగ్రగంగమ్మగా పుష్పరాజ్‌.. సీన్ దద్దరిల్లాలే.. నెట్టింట ఊచకోత కోస్తున్న బన్నీ వీడియో..

Pushpa-2 Video: పుష్ప అడుగుపడితే.. పులి కూడా కుక్క అయిపోవాలే..! సోషల్ మీడియాను రఫ్పాడిస్తున్న పుష్ప..

Published on: Apr 15, 2023 07:56 PM