అత్యంత ప్రమాదకరమైన పాము ప్రత్యక్షం.. భయంతో జనం పరుగులు !!

అత్యంత ప్రమాదకరమైన పాము ప్రత్యక్షం.. భయంతో జనం పరుగులు !!

Phani CH

| Edited By: Ravi Kiran

Updated on: Aug 31, 2022 | 6:19 PM

ప్రపంచవ్యాప్తంగా ఎన్నోరకాల పాములున్నాయి. అయితే అన్నీ విషపూరితమైనవి కావు. కానీ కొన్ని జాతులు మాత్రం అత్యంత విషపూరితమైనవి ఉన్నాయి. ఇవి కాటేసిన క్షణాల్లోనే మనుషులు చనిపోతారని నిపుణులు చెబుతున్నారు.

ప్రపంచవ్యాప్తంగా ఎన్నోరకాల పాములున్నాయి. అయితే అన్నీ విషపూరితమైనవి కావు. కానీ కొన్ని జాతులు మాత్రం అత్యంత విషపూరితమైనవి ఉన్నాయి. ఇవి కాటేసిన క్షణాల్లోనే మనుషులు చనిపోతారని నిపుణులు చెబుతున్నారు. వీటిలో బ్లాక్ మాంబా, కోబ్రా, రస్సెల్ వైపర్ లాంటి వాటిని అత్యంత ప్రమాదకర పాములుగా గుర్తించారు. అయితే.. ఈ జాతులన్నీ ఆఫ్రికా లాంటి దేశాల్లో ఎక్కువగా కనిపిస్తాయి. తాజాగా.. భారత్‌లో కూడా అత్యంత విషపూరితమైన రస్సెల్ వైపర్ పాము కనిపించడం చర్చనీయాంశంగా మారింది. మొదట ప్రజలు ఆ పామును చూసి కొండచిలువ అనుకున్నారు.. అయితే.. అక్కడున్న వారు కొందరు ఫొటోలు తీసి పంపడంతో అటవీశాఖ సిబ్బంది హెచ్చరిస్తూ స్థానికులను అప్రమత్తం చేశారు. ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన పాముల్లో ఒకటైన రస్సెల్ వైపర్ ఆగస్టు 26న మధ్యప్రదేశ్ ఖాండ్వాలోని సివిల్ లైన్స్ ప్రాంతంలో కనిపించింది. తొలుత కొండచిలువగా భావించిన ప్రజలు అటవీశాఖకు సమాచారం అందించారు. అటవీ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని, ఇది కొండచిలువ కాదని, ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన పాములలో ఒకటైన రస్సెల్స్ వైపర్ అని నివాసితులకు తెలిపారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పడగ విప్పి బుసలు కొడుతున్న సీతాకోక చిలుక !! షాక్‌లో స్థానికులు

మాస్క్‌లతో పెంపుడు చిలకలకు ఊయల !! వినూత్న ప్రయోగం చూసి షాక్ అవుతున్న నెటిజన్లు

Viral Video: 42 ఏళ్ల తర్వాత థియేటర్‌లో అడుగు పెట్టిన తాత !! ఏం జరిగిందంటే ??

వేల అడుగుల ఎత్తులో హెలికాఫ్టర్‌ నుంచి దూకేసిన వ్యక్తి !! తలక్రిందులుగా గిరగిరా తిరుగుతూ !!

గుడ్డులో నుంచి రాగానే పడగ విప్పుతూ బుసలు కొడుతోన్న బేబీ కోబ్రా !! వీడియో చూస్తే జలదరించాల్సిందే

Published on: Aug 31, 2022 08:23 AM