Video Viral: ఊ అంటావా మామా.. ఊఊ అంటావా మావా.. చీరకట్టులో సిజ్లింగ్ పర్ఫార్మెన్స్.. తగ్గేదేలే

సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్, రష్మిక మండన్నా కాంబినేషన్ లో వచ్చిన పుష్ప (Pushpa) సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో మనందరికీ తెలిసిందే. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన ఈ సినిమా దేశవ్యాప్తంగా ప్రభంజనం సృష్టించింది..

Video Viral: ఊ అంటావా మామా.. ఊఊ అంటావా మావా.. చీరకట్టులో సిజ్లింగ్ పర్ఫార్మెన్స్.. తగ్గేదేలే
Women Dance Vdieo
Follow us
Ganesh Mudavath

| Edited By: Ravi Kiran

Updated on: Aug 31, 2022 | 6:15 PM

సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్, రష్మిక మండన్నా కాంబినేషన్ లో వచ్చిన పుష్ప (Pushpa) సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో మనందరికీ తెలిసిందే. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన ఈ సినిమా దేశవ్యాప్తంగా ప్రభంజనం సృష్టించింది. సినిమాలోని డైలాగులు, పాటలు, డ్యాన్సులు అభిమానులను ఉర్రూతలూగించాయి. అయితే సినిమా విడుదలై ఇప్పటికే చాలా నెలలు గడుస్తున్నా పుష్ప క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ముఖ్యంగా సినిమాలోని పాటలు, డ్యాన్స్ కు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో (Social Media) వైరల్ గా మారుతున్నాయి. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఈ క్లిప్ లో ముగ్గురు మహిళలు ఊ అంటావా పాటకు అద్భుతమైన స్టెప్పులు వేసి ఆశ్చర్యపరిచారు. వారు ఎంత బాగా డ్యాన్స్ చేశారంటే.. సమంత వేసిన స్టెప్పులను యాసిటీస్ గా దింపేసినంతగా.. బెల్లీ డ్యాన్స్‌ను చూసే ఉంటారు. వైరల్ (Viral) అవుతున్న వీడియోలో ఈ ముగ్గురు మహిళలు ఊ అంటావా పాటకు బెల్లీ డ్యాన్స్ చేస్తూ సోషల్ మీడియాను షేక్ చేశారు. వారి డ్యాన్సే కాదు.. చీరకట్టు, ఎక్స్‌ప్రెషన్స్ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ‘ఊ అంటావా’ పాటకు డ్యాన్స్ చేసిన తర్వాత, ‘టిప్ టిప్ బర్సా పానీ’ పాటకు స్టెప్పులు వేయడాన్ని ఈ వీడియోలో చూడవచ్చు. వారి నృత్యం చూస్తుంటే అచ్చం ప్రొఫెషనల్స్ ను తలపించారు. వీడియో చూస్తుంటే ఏదో ఫంక్షన్ జరుగుతోందని, అందులో చాలా మంది మహిళలు పాల్గొంటున్నారని తెలుస్తోంది. వీరిలో ముగ్గురు డ్యాన్స్ చేస్తుంటే, మిగిలిన మహిళలు వారి డ్యాన్స్‌ని చూస్తూ చప్పట్లు కొడుతూ వారిని ఉత్సాహపరుస్తున్నారు.

వైరల్ అవుతున్న ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ యూట్యూబ్‌లో పోస్ట్ అయింది. రెండు నిమిషాల 5 సెకన్ల ఈ వీడియోకు ఇప్పటివరకు 1 లక్షా 88 వేలకు పైగా వ్యూస్ వచ్చాయి. ఈ సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. అంతే కాకుండా వీడియో చూసిన తర్వాత నెటిజన్లు విపరీతంగా కామెంట్లు చేస్తున్నారు. వారి డ్యాన్స్‌ అద్భుతంగా ఉందని, అచ్చం సినిమా స్టార్ చేసినట్లే ఉందని వ్యాఖ్యానిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం చూడండి..