పడగ విప్పి బుసలు కొడుతున్న సీతాకోక చిలుక !! షాక్‌లో స్థానికులు

పడగ విప్పి బుసలు కొడుతున్న సీతాకోక చిలుక !! షాక్‌లో స్థానికులు

Phani CH

| Edited By: Ravi Kiran

Updated on: Aug 31, 2022 | 6:19 PM

ప్రకృతిలో ఎన్నో రకాల జీవరాశులు ఉన్నాయి. ఒకే జాతికి చెందినవైనా కొన్ని భిన్న లక్షణాలు కలిగి ఉంటాయి. అలాంటి ఓ జీవి ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాలో ప్రత్యక్షమైంది.

ప్రకృతిలో ఎన్నో రకాల జీవరాశులు ఉన్నాయి. ఒకే జాతికి చెందినవైనా కొన్ని భిన్న లక్షణాలు కలిగి ఉంటాయి. అలాంటి ఓ జీవి ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాలో ప్రత్యక్షమైంది. దానిని చూసి స్థానికులు ఒకింత కంగారు పడ్డారు. తర్వాత అసలు విషయం తెలిసి ఆశ్చర్యపోయారు. అసలు విషయం ఏంటంటే.. ఏపీలోని శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు సమీపంలోని తోటల్లో ఓ వింతైన సీతాకోక చిలుక కనువిందు చేసింది.. స్థానికంగా నివసించే ఓ వ్యక్తి ఇంటి సమీపంలోని ఒక చెట్టుపై ఈ వింత సీతాకోకచిలుక కనిపించింది. దానిని చూసిన ఆ ఇంటి యజమాని మొదట కంగారు పడ్డాడట… ఆ తర్వాత తేరుకుని దానిని నిశితంగా గమనించారట. దూరం నుంచి చూస్తే అది నాగుపాము పడగను పోలి ఉంది. రెక్కలు విప్పితే దాని శరీరంపై వింతైన కళ్ల మాదిరిగా కనిపించింది. దగ్గరగా పరిశీలించి చూసిన అతడు అది సీతాకోక చిలుక అని నిర్దారించుకున్నారు. వెంటనే ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్‌ చేశారు. దాంతో ఈ వింత బట్టర్‌ఫ్లై ఇప్పుడు నెట్టింట వైరల్‌గామారి తెగ చక్కర్లు కొడుతోంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మాస్క్‌లతో పెంపుడు చిలకలకు ఊయల !! వినూత్న ప్రయోగం చూసి షాక్ అవుతున్న నెటిజన్లు

Viral Video: 42 ఏళ్ల తర్వాత థియేటర్‌లో అడుగు పెట్టిన తాత !! ఏం జరిగిందంటే ??

వేల అడుగుల ఎత్తులో హెలికాఫ్టర్‌ నుంచి దూకేసిన వ్యక్తి !! తలక్రిందులుగా గిరగిరా తిరుగుతూ !!

గుడ్డులో నుంచి రాగానే పడగ విప్పుతూ బుసలు కొడుతోన్న బేబీ కోబ్రా !! వీడియో చూస్తే జలదరించాల్సిందే

Vikram: ఒక్క విక్రమ్‌ వల్ల..1788 పైరసీ సైట్లు మటాష్‌


 

Published on: Aug 31, 2022 08:21 AM