36 ఎకరాలు.. 45 అంతస్తులు.. 4500 ఆఫీసులు.. ప్రపంచంలోనే అతిపెద్ద కార్పొరేట్‌ ఆఫీస్

36 ఎకరాలు.. 45 అంతస్తులు.. 4500 ఆఫీసులు.. ప్రపంచంలోనే అతిపెద్ద కార్పొరేట్‌ ఆఫీస్

Phani CH

|

Updated on: Dec 22, 2023 | 1:46 PM

దేశంలో డైమండ్స్‌ బిజినెస్‌కి కేరాఫ్‌ అడ్రస్‌గా ఉన్న సూరత్‌... ఇప్పుడు ఇంటర్నేషనల్‌ ట్రేడ్‌ సెంటర్‌గా మారబోతోంది. వజ్రాభరణాల ట్రేడింగ్‌ కోసం ప్రపంచంలోనే అతిపెద్ద కార్పొరేట్‌ కార్యాలయాన్ని నిర్మించారు. సూరత్‌లో నిర్మించిన డైమండ్‌ బోర్స్‌ను ప్రారంభించారు ప్రధాని మోదీ. 36 ఎకరాల విస్తీర్ణంలో 45 అంతస్తుల్లో దీన్ని నిర్మించారు. ఒకేసారి 67వేల మంది కంఫర్ట్‌బుల్‌గా కార్యకలాపాలు చేసుకునేలా ఈ భవన నిర్మాణం జరిగింది.

దేశంలో డైమండ్స్‌ బిజినెస్‌కి కేరాఫ్‌ అడ్రస్‌గా ఉన్న సూరత్‌… ఇప్పుడు ఇంటర్నేషనల్‌ ట్రేడ్‌ సెంటర్‌గా మారబోతోంది. వజ్రాభరణాల ట్రేడింగ్‌ కోసం ప్రపంచంలోనే అతిపెద్ద కార్పొరేట్‌ కార్యాలయాన్ని నిర్మించారు. సూరత్‌లో నిర్మించిన డైమండ్‌ బోర్స్‌ను ప్రారంభించారు ప్రధాని మోదీ. 36 ఎకరాల విస్తీర్ణంలో 45 అంతస్తుల్లో దీన్ని నిర్మించారు. ఒకేసారి 67వేల మంది కంఫర్ట్‌బుల్‌గా కార్యకలాపాలు చేసుకునేలా ఈ భవన నిర్మాణం జరిగింది. 4500పైగా వివిధ కార్యాలయాలున్న ఈ భవనంలో 131 హైస్పీడ్‌ లిఫ్ట్‌లు ఉన్నాయ్‌. అంతేకాదు, ప్రపంచంలోనే అతిపెద్ద ఇంటర్‌కనెక్టెడ్‌ భవనంగా రికార్డ్‌ సృష్టించింది ఈ నిర్మాణం. అంతర్జాతీయ వజ్రాభరణాల వ్యాపారానికి ఇది ప్రపంచంలోనే అతిపెద్ద, అత్యంత ఆధునిక కేంద్రం అని చెప్పాలి. ఈ భవనంలో 175 దేశాల నుంచి 4వేల మందికి పైగా వ్యాపారులు తమ కార్యకలాపాలను నిర్వహించనున్నారు. ఎగుమతులు-దిగుమతులు, కస్టమ్స్‌ క్లియరెన్స్‌, రిటైల్‌ జువెలరీ, డైమండ్ రీసెర్చ్ సెంటర్‌… ఇలా ఎన్నో విభాగాలు ఇక్కడ ఉన్నాయ్‌. ప్రత్యక్షంగా పరోక్షంగా డైమండ్‌ బోర్స్‌ ద్వారా లక్షన్నర మందికి ఉపాధి లభించబోతోంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Pallavi Prashanth: 9సెక్షన్లు.. బెయిల్‌ రాద.. 3సం. జైలు !! పాపం ప్రశాంత్ పరిస్థితి దారుణం

Tamannaah Bhatia: 132 కోట్లు.. దిమ్మతిరిగేలా చేస్తున్న తమన్నా ఆస్తుల విలువ

Bhole Shavali: రైతుబిడ్డ చేయి వదలని భోళె.. మంచితనంలో గొప్పోడబ్బా..

Dunki Review: ఈ ఏడాది షారుక్‌ హ్యాట్రిక్‌ కొట్టారా ?? డంకీ రివ్యూ

సలార్ Vs డంకీ.. మధ్య సర్వే.. దిమ్మతిరగే రిజల్ట్