తాత ముత్తాతల మూలాలేవి? 150 ఏళ్ల తర్వాత భారత్‌కు ఐదో తరం వ్యక్తి !! అచ్ఛం 7 తరాలు కథ లాంటి స్టోరీ
ఏడు తరాలు పేరుతో ఓ పుస్తకం ఉంది. అందులో ఓ వ్యక్తి తన పూర్వికుల మూలాలను ఎలా వెదుకుతాడు అని అందులో అద్భుతంగా వర్ణించారు..రచయిత ఎలెక్స్ హేలీ. అచ్ఛం అలాంటి ఘటనే ఒడిశాలో జరిగింది. కాకపోతే ఈ స్టోరీలో ఐదు తరాలు మాత్రమే ఉంటాయి. 150 ఏళ్ల కిందట భారత్ నుంచి వలస వెళ్లిన ఓ వ్యక్తి.. మారిషస్‌లో కార్మికుడిగా పని చేస్తూ అక్కడే ఉండిపోయాడు.
ఆయన చనిపోయిన తర్వాత నలుగురు పిల్లలు ఆ దేశంలో పెళ్లిళ్లు చేసుకుని స్థిరపడ్డారు. వారికీ పిల్లలు కలిగారు. అయితే.. ఇప్పుడు ఆ కుటుంబ వారసుడైన ఓ వ్యక్తి.. తమ పూర్వీకుల మూలాలు కనుగొనేందుకు ఏకంగా మారిషస్ నుంచి భారత్ తిరిగి వచ్చాడు. అతనే రామ్‌రజ్ జగన్నాథ్ . ఒడిశాలోని జాజ్‌పూర్ జిల్లాకు వచ్చిన ఆయన, తన పూర్వీకులు ఉన్న గ్రామాన్ని కనిపెట్టేందుకు అధికారుల సాయం కోరారు. రామ్‌రజ్ కథ విని చలించిన అధికారులు పూర్తి సహకారాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు. తన పూర్వీకులు వైతరణీ నది గురించి నిత్యం తమతో చెప్పేవారని తెలిపారు. దీంతో ఆయన్ను అధికారులు వైతరణీ వద్దకు తీసుకెళ్లారు. నదీ తీరంలో తన పూర్వీకులు పిండ ప్రదానం చేశారు. తన పెదనాన్న అస్థికలను వైతరణీ నదిలో నిమజ్జనం చేశారు. తన చితాభస్మాన్ని వైతరణిలో కలపాలనేది ఆయన చివరి కోరిక అని భావోద్వేగానికి గురయ్యారు. ప్రస్తుతం రామ్‌రథ్ పూర్వీకుల ఊరు కోసం అప్పటి భూ, ఓడరేవు, ఆలయాల రికార్డులు, గ్రామాల పటాల సాయంతో వెతుకుతున్నారు. 1840 నుంచి 1870 మధ్యకాలంలో ఒడిశా కరువు కోరల్లో చిక్కుకుని వేలాది మంది ఆకలితో చనిపోయారు. ఆ సమయంలో అక్కడ ప్రజలు ఉపాధి వెతుక్కుంటూ సముద్ర మార్గంలో మారిషస్‌కు వెళ్లారు. జాజ్‌పూర్ జిల్లాకు చెందిన జగన్నాథ్ దాస్ 25 ఏళ్ల వయసులో కలకత్తా పోర్టు నుంచి నౌకలో మారిషన్ చేరుకున్నారు. అక్కడే పెళ్లి చేసుకున్న ఆయనకు నలుగురు పిల్లలు. 1912లో ఆయన కన్నుమూశారు. ఆయన కుటుంబానికి చెందిన నాలుగు తరాల వారసులు ఒడియా భాషలోనే మాట్లాడేవారు. కాగా, పెద్దలు చెప్పిన విషయాలు గుర్తుపెట్టుకున్న రామ్‌రజ్.. మాతృదేశంతో ఉన్న భావోద్వేగ అనుబంధం ఐదో తరం వారుసుడ్ని ఇక్కడకు రప్పించేలా చేసింది. తన మూలాలను వెతుక్కుంటూ ప్రస్తుతం రామ్‌రజ్ ఒడిశాకు వచ్చారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మయన్మార్‌లో సైబర్ మాఫియా దారుణాలు.. బయటపడ్డ 400 మంది భారతీయ బాధితులు
చైనా సముద్రంలో కూలిన అమెరికా విమానం
ISRO: మరో అతిపెద్ద రాకెట్ ప్రయోగానికి ఇస్రో సిద్దం
డ్రైవర్పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
కోటి రూపాయల ఫ్యాన్సీ నెంబర్ వేలంలో బిగ్ ట్విస్ట్
కిడ్నీ ఇచ్చి.. ప్రాణం పోసిన తండ్రి
కొడుకు కోసం భార్యాభర్తల మధ్య పంచాయితీ.. కట్ చేస్తే..
ప్రియుడి మృతదేహాన్ని పెళ్లి చేసుకుని.. కన్నీళ్లు పెట్టిన యువతి

