చింపాంజీ గెటప్‌లో మున్సిపల్ సిబ్బంది.. జనగామలో వింత ప్రయోగం
జనగామలో మున్సిపల్ అధికారులు కొత్త వేషాలతో విధులు నిర్వహిస్తున్నారు. చింపాంజీ వేషాలు ధరించి గల్లీగల్లీలో పరుగులు పెడుతున్నారు. కోతుల బెడద నుండి విముక్తి కోసం మున్సిపల్ అధికారులు ఈ ఐడియాతో ముందుకొచ్చారు. గత కొంతకాలంగా పట్టణ వాసులను నానా ఇబ్బందులు పెడుతున్న కోతుల బెడద వదిలించేందుకు ప్రత్యేకంగా సిబ్బందిని నియమించి వారికి చింపాంజీ వేషం వేసి పట్టణమంతా తిప్పుతున్నారు.
అధికారుల ప్రయోగంతో కోతులన్నీ బెదిరిపోయి.. పారిపోవటంతో.. స్థానికులు తాత్కాలిక ఉపశమనం పొందుతున్నారు. కాగా, మున్సిపల్ సిబ్బంది పగటి వేషాలు, చింపాంజీ వేషధారణ స్థానికంగా హాట్ టాపిక్ గా మారింది. జనగామ పట్టణం చుట్టూ గుట్టలు ఎక్కువగా ఉండటంతో కోతుల బెడద విపరీతంగా పెరిగిపోయింది. వేలాది కోతులు పట్టణ ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇళ్లలోకి చొరబడి రక్కి గాయపరుస్తున్నాయి. పట్టణంలో చిన్నారులు, వృద్ధులు ఒంటరిగా తిరగలేని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రజల నుండి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. కోతుల నుండి మా ప్రాణాలు కాపాడండి మొర్రో అంటూ స్థానికులు అధికారులను వేడుకున్నారు. సాధారణంగా.. చింపాంజీని చూస్తే కోతులు భయపడతాయి గనుక.. మున్సిపల్ కమిషనర్ ఈ సరికొత్త ఆలోచనతో ముందుకొచ్చారు. ప్రత్యేకంగా నిధులు వెచ్చించి చింపాంజీ మాస్క్ లు తెప్పించారు. ఈ చింపాంజీ వేషాలు వేసుకున్న సిబ్బంది.. పట్టణంలోని వీధుల్లో పరిగెడుతుంటంతో.. కోతులను హడలెత్తి పారిపోతున్నాయి. సిబ్బందికి వేషాలు ధరించడం కాస్త ఇబ్బందిగా ఉన్నప్పటికీ కోతుల నుండి ప్రజలకు విముక్తి లభించడంతో అధికారులు సిబ్బంది అంతా ఊపిరి పీల్చుకున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Gold Price Today: మళ్లీ తగ్గిన బంగారం ధర.. ఎంతో తెలుసా
తాత ముత్తాతల మూలాలేవి? 150 ఏళ్ల తర్వాత భారత్‌కు ఐదో తరం వ్యక్తి !! అచ్ఛం 7 తరాలు కథ లాంటి స్టోరీ
మయన్మార్‌లో సైబర్ మాఫియా దారుణాలు.. బయటపడ్డ 400 మంది భారతీయ బాధితులు
డ్రైవర్పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
కోటి రూపాయల ఫ్యాన్సీ నెంబర్ వేలంలో బిగ్ ట్విస్ట్
కిడ్నీ ఇచ్చి.. ప్రాణం పోసిన తండ్రి
కొడుకు కోసం భార్యాభర్తల మధ్య పంచాయితీ.. కట్ చేస్తే..
ప్రియుడి మృతదేహాన్ని పెళ్లి చేసుకుని.. కన్నీళ్లు పెట్టిన యువతి

