పశ్చిమగోదావరి జిల్లా వడలి గ్రామంలో వందేళ్ల తల్లి, 80ఏళ్ల కూతురికి పెన్ష్ కష్టాలు.. వీడియో
అయిన వాళ్లు ఎవరూ లేరు..వాళ్లిద్దరూ వృద్ధులే..ఒకరికి ఒకరై తోడుగా ఉంటూ..జీవనం సాగిస్తున్నారు..కష్టపడి పని చేసుకోవాలంటే..కాళ్లుచేతులు సహకరించిన వయసులో ఆసరా పెన్షన్‌పై ఆధారపడి బతుకు బండి లాగించేస్తున్నారు..
అయిన వాళ్లు ఎవరూ లేరు..వాళ్లిద్దరూ వృద్ధులే..ఒకరికి ఒకరై తోడుగా ఉంటూ..జీవనం సాగిస్తున్నారు..కష్టపడి పని చేసుకోవాలంటే..కాళ్లుచేతులు సహకరించిన వయసులో ఆసరా పెన్షన్‌పై ఆధారపడి బతుకు బండి లాగించేస్తున్నారు..కానీ, సర్కార్ పెట్టిన నిబంధనలు ఆ తల్లి కూతుర్లకు నోటి కాడి ముద్దను దూరం చేశాయి…ఎవరా.. తల్లి కూతళ్లు..ఏంటి వారి కష్టం… తల్లికి 100ఏళ్లు..ఆమె కూతురికి 80 ఏళ్లు..ఇద్దరిదీ కాటికి కాలు చాచిన వయసే..పాపం ఈ ఇద్దరూ ఒకరికి ఒకరు తప్ప…మూడో బంధం లేదు..తల్లి పేరు పువ్వల రాఘవులు, కూతురు సరస్వతి..వీరిది పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండ మండలం వడలి గ్రామం. వీరికి ఇప్పుడో పెద్ద కష్టమే వచ్చిపడింది..ప్రభుత్వ నిబంధనల కారణంగా వీరికి మంజూరు అయిన వృద్దాప్య పెన్షన్ ఇప్పుడు ఆగిపోయింది..తల్లి కూతుర్లు ఇద్దరూ… ఒకే రేషన్ కార్డులో పేర్లు నమోదు అయిఉండటంతో..అధికారులు వీరి పెన్షన్‌ను తొలగించారంటూ బాధితులు వాపోతున్నారు.
మరిన్ని ఇక్కడ చూడండి: రెప్పపాటులో తప్పిన ప్రమాదం..!! ఆయుష్షు గట్టిగానే ఉంది.. వీడియో
విశాఖ జిల్లా అమానవీయ ఘటన.. ముళ్ళపొదల్లో గుక్కకట్టిన పసిపాప.. వీడియో
Viral Video: ఆకాశంలో గద్ద.. సముద్రంలోని చేపకు గురి.. చివరికి ఏమైందంటే..?? వీడియో