Viral Video: రోడ్డుపై చెంపదెబ్బలు కొట్టుకున్న యువతీ,యువకుడు.. కారణం ఏంటంటే.. వీడియో
ఈ మధ్య కాలంలో కొందరు యూటూబ్ బ్లాగర్లు పుట్టించే రోతకు.. హద్దులు లేకుండా పోతున్నాయి. మరీ ముఖ్యంగా ఫన్నీ ఫ్రాంక్ పేరుతో సామాన్య జనంను బెంబేలెత్తిస్తున్నారు కొందరు బ్లాగర్లు.
ఈ మధ్య కాలంలో కొందరు యూటూబ్ బ్లాగర్లు పుట్టించే రోతకు.. హద్దులు లేకుండా పోతున్నాయి. మరీ ముఖ్యంగా ఫన్నీ ఫ్రాంక్ పేరుతో సామాన్య జనంను బెంబేలెత్తిస్తున్నారు కొందరు బ్లాగర్లు. ఇక తాజాగా అలాంటి ఓ ఫ్రాంక్ వీడియో చేయడమే కాకుండా.. ఎందుకు చేశావని ప్రశ్నించిన యువకుడి చెంప పగలగొట్టి నానా రచ్చ చేసింది యువతి. ఈ సంఘటన ఢిల్లీలోని కానాట్ ప్రాంతంలో జరిగింది. ఓ పార్కులో.. సదరు యువతి సరదాగా ప్రాంక్ వీడియో చేస్తుంది. దీనిలో భాగంగా రోడ్డుపై వెళ్తున్న యువకులపై కూల్ డ్రింక్స్‌ను వేసింది. ఈ క్రమంలో ఒక యువకుడిపై, సదరు యువతి డ్రింక్‌ను పోసింది. దీంతో అతను షాక్‌కు గురయ్యాడు. దీంతో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఆ యువకుడిని, యువతి నోటికొచ్చినట్లు తిట్టింది. కాసేపు ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరిగింది. ఈ క్రమంలో ఆ యువతి, యువకుడిని చెంపదెబ్బకొట్టింది.
మరిన్ని ఇక్కడ చూడండి: పశ్చిమగోదావరి జిల్లా వడలి గ్రామంలో వందేళ్ల తల్లి, 80ఏళ్ల కూతురికి పెన్ష్ కష్టాలు.. వీడియో
రెప్పపాటులో తప్పిన ప్రమాదం..!! ఆయుష్షు గట్టిగానే ఉంది.. వీడియో
విశాఖ జిల్లా అమానవీయ ఘటన.. ముళ్ళపొదల్లో గుక్కకట్టిన పసిపాప.. వీడియో