ఆహారం అందిస్తుండగా సింహం దాడి.. చివరకు ??
నైజీరియాలోని ఓ జూ ఉద్యోగి సింహానికి బలైపోయాడు. మాజీ అధ్యక్షుడు ఒబసాంజోకు చెందిన పార్కులో ఈ ఘటన జరిగింది. బబజీ దౌలే అనే సుశిక్షుతుడైన జూ కీపర్ అందులోని సింహానికి ఆహారం వేయడం వంటి పనులు చూస్తుంటాడు. శనివారం సాయంత్రం కొందరు సందర్శకులు రావడంతో వారికి సింహానికి ఆహారం వేసే విధానం చూపించాలనుకున్నాడు. సింహం ప్రశాంతంగా ఉన్నట్లు కనిపించడంతో సాధారణంగా మూసి ఉంచాల్సిన గేటును తెరిచి..
నైజీరియాలోని ఓ జూ ఉద్యోగి సింహానికి బలైపోయాడు. మాజీ అధ్యక్షుడు ఒబసాంజోకు చెందిన పార్కులో ఈ ఘటన జరిగింది. బబజీ దౌలే అనే సుశిక్షుతుడైన జూ కీపర్ అందులోని సింహానికి ఆహారం వేయడం వంటి పనులు చూస్తుంటాడు. శనివారం సాయంత్రం కొందరు సందర్శకులు రావడంతో వారికి సింహానికి ఆహారం వేసే విధానం చూపించాలనుకున్నాడు. సింహం ప్రశాంతంగా ఉన్నట్లు కనిపించడంతో సాధారణంగా మూసి ఉంచాల్సిన గేటును తెరిచి మరీ ఆహారం వేయడం ప్రారంభించాడు. ఆ సింహం అనుకోకుండా అతనిపై దాడి చేసి, మెడను నోట కరుచుకుంది. దీంతో, నోట కరుచుకున్న మెడను విడిపించేందుకు సెక్యూరిటీ గార్డులు సింహాన్ని కాల్చి చంపారు. కానీ ఆ ఎన్‌క్లోజర్‌లోనే రక్తపు మడుగులో పడిపోయాడు జూ కీపర్. జూ సిబ్బంది అతడిని వెంటనే బయటకు తీసుకొచ్చి ఆసుపత్రికి తరలించారు. అప్పటికే తీవ్ర గాయాల పాలైన బబజీ దౌలే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. చాలా ఏళ్లుగా ఈ జూలో పని చేస్తున్న బబజీ దౌలే .. సింహానికి ఫుడ్ వేసే క్రమంలో ఎన్‌క్లోజర్‌కి ఉన్న సెకండ్ డోర్‌కి తాళం వేయడం మరిచిపోయి ఉంటాడని అందుకే సింహం దాడి చేసి ఉండొచ్చని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. సింహానికి ఆహారం అందించినప్పుడు ఓ డోర్‌లో నుంచి వెళ్లి మరో డోర్ నుంచి ఎగ్జిట్ అవుతారు. ఓ డోర్‌కి తాళం వేస్తేనే ..సింహానికి జూకీపర్‌పై దాడి చేసే వీల్లేకుండా ఉంటుంది. కానీ…బబజీ దౌలే మాత్రం తాళం వేయలేదని అనుమానిస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వామ్మో.. గర్ల్స్ హాస్టల్‌లో.. రాత్రి వేళ సీన్ ఇలా ఉంటుందా !!
అది ఓడనా ?? లేక ఆర్టీసీ బస్సా ?? అతనేం చేసాడో చూస్తే నవ్వాగదు
క్యాష్ ఆన్ డెలివరీపై రూ.లక్షన్నర ఐఫోన్ ఆర్డర్ !! డెలివరీ ఏజెంట్ ఇంటికొచ్చాక ??
తిరుమల అన్న ప్రసాదంలో జెర్రి దుమారం.. టీటీడీ ఏం చెప్పింది ??
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్‌లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..

