Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తిరుమల అన్న ప్రసాదంలో జెర్రి దుమారం.. టీటీడీ ఏం చెప్పింది ??

తిరుమల అన్న ప్రసాదంలో జెర్రి దుమారం.. టీటీడీ ఏం చెప్పింది ??

Phani CH

|

Updated on: Oct 07, 2024 | 5:38 PM

తిరుమల లడ్డూ తయారీలో జంతువుల కొవ్వుతో కూడిన నెయ్యి వాడారన్న ఆరోపణలు ఇప్పటికే కుదిపేస్తున్నాయి. కోట్లాదిమంది భక్తుల మనోభావాలతో ముడిపడిన ఈ వ్యవహారం సుప్రీంకోర్టు వరకూ చేరింది. దీనిపై స్వతంత్ర సిట్ ఏర్పాటు చేస్తూ సర్వోన్నత న్యాయస్థానం కూడా ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ వివాదంపై దేశవ్యాప్తంగా ఇంకా చర్చ జరుగుతున్న సమయంలోనే.. తిరుమల అన్నప్రసాదంలో జెర్రి కనిపించిందన్న ఆరోపణలు సంచలనంగా మారాయి.

తిరుమల లడ్డూ తయారీలో జంతువుల కొవ్వుతో కూడిన నెయ్యి వాడారన్న ఆరోపణలు ఇప్పటికే కుదిపేస్తున్నాయి. కోట్లాదిమంది భక్తుల మనోభావాలతో ముడిపడిన ఈ వ్యవహారం సుప్రీంకోర్టు వరకూ చేరింది. దీనిపై స్వతంత్ర సిట్ ఏర్పాటు చేస్తూ సర్వోన్నత న్యాయస్థానం కూడా ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ వివాదంపై దేశవ్యాప్తంగా ఇంకా చర్చ జరుగుతున్న సమయంలోనే.. తిరుమల అన్నప్రసాదంలో జెర్రి కనిపించిందన్న ఆరోపణలు సంచలనంగా మారాయి. తిరుమలలోని టీటీడీ మాధవ నిలయం అన్నదాన కేంద్రంలో ఓ భక్తుడి ప్లేటులో జెర్రి కనిపించడం కలకలం రేపింది. అన్న ప్రసాద కేంద్రంలో పెరుగన్నం స్వీకరించిన భక్తుడికి జెర్రీ కనిపించిదన్న వార్త కలవరపాటుకు గురిచేసింది. శనివారం మధ్యాహ్నం జరిగిన ఈ ఘటన పై భక్తుడు విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేస్తానని తెలపడంతో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ విషయం సోషల్ మీడియాలోనూ వైరల్ కావడంతో టీటీడీ ఉన్నతాధికారుల దృష్టికి వెళ్ళింది. దీంతో టీటీడీ స్పందించింది. అన్న ప్రసాదంలో జెర్రీ పడిందన్న విషయం పూర్తిగా దుష్ప్రచారమని టీటీడీ ప్రకటన విడుదల చేసింది. మాధవ నిలయంలోని అన్నప్రసాద కేంద్రంలో తాను తిన్న అన్నప్రసాదంలో జెర్రీ కనబడిందని భక్తుడు చేసిన ఆరోపణలలో వాస్తవం లేదని టీటీడీ తెలిపింది. తిరుమలలో శ్రీవారి దర్శనార్థం వచ్చే వేలాదిమంది భక్తులకు వడ్డించడానికి పెద్ద మొత్తంలో అన్నప్రసాదాలను తయారుచేస్తామని, అలాంటిది జెర్రీ వచ్చిందని సదరు భక్తుడు పేర్కొనటం ఆశ్చర్యకరంగా ఉందని టీటీడీ పేర్కొంది. మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్...

Published on: Oct 07, 2024 05:10 PM