క్యాష్ ఆన్ డెలివరీపై రూ.లక్షన్నర ఐఫోన్ ఆర్డర్ !! డెలివరీ ఏజెంట్ ఇంటికొచ్చాక ??
ఉత్తరప్రదేశ్‌లో షాకింగ్ ఘటన జరిగింది. క్యాష్ ఆన్ డెలివరీపై లక్షన్నర రూపాయల విలువైన ఐఫోన్ ను ఆర్డరిచ్చిన నిందితులు, ఇంటికొచ్చిన డెలివరీ ఏజెంట్‌ను చంపి దాన్ని తస్కరించారు. లక్నోలో ఈ దారుణం వెలుగు చూసింది. పూర్తి వివరాల్లోకి వెళితే, భరత్ సాహు అనే డెలివరీ ఏజెంట్ సెప్టెంబర్ 25న దారుణ హత్యకు గురయ్యాడు. తొలుత హిమాన్షూ కనౌజియా అనే నిందితుడు ముందస్తు ప్లాన్ ప్రకారం ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఐఫోన్ ఆర్డరిచ్చాడు.
ఉత్తరప్రదేశ్‌లో షాకింగ్ ఘటన జరిగింది. క్యాష్ ఆన్ డెలివరీపై లక్షన్నర రూపాయల విలువైన ఐఫోన్ ను ఆర్డరిచ్చిన నిందితులు, ఇంటికొచ్చిన డెలివరీ ఏజెంట్‌ను చంపి దాన్ని తస్కరించారు. లక్నోలో ఈ దారుణం వెలుగు చూసింది. పూర్తి వివరాల్లోకి వెళితే, భరత్ సాహు అనే డెలివరీ ఏజెంట్ సెప్టెంబర్ 25న దారుణ హత్యకు గురయ్యాడు. తొలుత హిమాన్షూ కనౌజియా అనే నిందితుడు ముందస్తు ప్లాన్ ప్రకారం ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఐఫోన్ ఆర్డరిచ్చాడు. క్యాష్ ఆన్ డెలివరీపై (వస్తువు డెలివరీ అయ్యాక డబ్బు చెల్లించడం) ఫోన్‌కు ఆర్డర్ పెట్టిన అతడు చిన్హాట్ ప్రాంతంలోని తన ఇంటి అడ్రస్ కూడా ఇచ్చాడు. కాగా, సాహు ఫోన్ డెలివరీ ఇచ్చేందుకు కనౌజీయా ఇంటికి వచ్చాడు. అప్పటికే అక్కడ సిద్ధంగా ఉన్న మరో ఇద్దరు నిందితులు గజానన్, ఆకాశ్.. భరత్ గొంతు నులిమి చంపి హత్య చేశారు. అతడి వద్ద ఉన్న ఫోన్‌ను తీసుకున్నాక మృతదేహాన్ని సమీపంలో ఉన్న ఇందిరా కాలవలో పడేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
తిరుమల అన్న ప్రసాదంలో జెర్రి దుమారం.. టీటీడీ ఏం చెప్పింది ??

ఒకే ఒక్క క్లూతో ట్రావెల్ బ్యాగులో డెడ్‌బాడీ మిస్టరీ వీడింది వీడియ

రైతు వేషంలో పోలీసులు.. తర్వాత ఏమైదంటే? వీడియో

వార్నీ.. ఇదేం బిజినెస్ రా అయ్యా వీడియో

దృశ్యం సినిమాను తలపించేలా వరుస చోరీలు వీడియో

వామ్మో .. ఎంత పని చేసిందీ కోతి.. రూ. 20 లక్షల విలువైన పర్సు చోరీ

కడుపునొప్పితో ఆస్పత్రికి మహిళ.. టెస్టులు చేయగా..

చేపలు వేటకు వెళ్లిన జాలర్లు.. సముద్రంలో తెలియాడుతున్నది చూసి
