Nasa video: ఏమండోయ్ ఇది విన్నారా..? చంద్రుడిపైకి మనుషులు.. ప్లాన్ రెడీ చేసిన నాసా..!
చంద్రుడి మీదకు మనుషుల్ని పంపించేందుకు నాసా రెడీ అయింది. ఇందుకు గానూ.. చంద్రుడిపై ప్రయోగించనున్న ఆర్టెమిస్ రాకెట్‌కు చెందిన అప్‌డేట్ ఇచ్చింది నాసా. స్పేస్ లాంచ్ సిస్టమ్‌కు చెందిన రాకెట్‌ను .
చంద్రుడి మీదకు మనుషుల్ని పంపించేందుకు నాసా రెడీ అయింది. ఇందుకు గానూ.. చంద్రుడిపై ప్రయోగించనున్న ఆర్టెమిస్ రాకెట్‌కు చెందిన అప్‌డేట్ ఇచ్చింది నాసా. స్పేస్ లాంచ్ సిస్టమ్‌కు చెందిన రాకెట్‌ను .. ఫ్లోరిడాలోని కెన్నడీ స్పేస్ సెంటర్‌లో లాంచ్‌ప్యాడ్‌కు తీసుకువచ్చారు. ఆ రాకెట్ ద్వారా తొలుత వ్యోమగాములులేని క్యాప్సూల్‌ను చంద్రుడి మీదకు పంపనున్నారు. ఒకవేళ అన్నీ అనుకూలిస్తే మరికొన్ని నెలల్లో ఆర్టెమిస్ రాకెట్ నింగికి ఎగరనుందని వెల్లడించింది నాసా. SLSరాకెట్లను నాసా కొత్తగా డెవలప్ చేస్తోంది. అయితే ఈ రాకెట్ల ద్వారా మూన్ మీదకు మనుషుల్ని పంపాలనుకుంటోంది. ఈ దశాబ్ధం రెండవ అర్థభాగంలో ఎస్ఎల్ఎస్ రాకెట్ ద్వారా వ్యోమగాములను చంద్రుడి మీదకు పంపాలని నాసా భావిస్తోంది. అయితే చంద్రుడి మీదకు ఈ రాకెట్ వెళ్లిన తర్వాత అక్కడ మానవుడు జీవించేందుకు అనుకూలంగా ప్రాంతం, అలాగే వాతావరణంపై ఓ రిసెర్చ్ చేయబోతుంది నాసా.
మరిన్ని చూడండి ఇక్కడ:
viral Video: ఇంటి అద్దె కట్టలేక ఆఫీసులోనే మకాం పెట్టేసాడు.. తర్వాత ఏమైందంటే..?
NTR-Ram Charan-RRR: ఒకరు మన్యం ధీరుడు.. మరొకరు గిరిజన వీరుడు.. రామ్ భీమ్‌ల మధ్య స్నేహం..