30 ఏళ్ల తర్వాత స్కూల్ టీచర్ పై .. ప్రతీకారం తీర్చుకున్న బెల్జియం వాసి.. వీడియో చుస్తే షాక్ అవ్వడం ఖాయం..
స్కూల్లో అవమానించిన టీచర్‌పై ఓ వ్యక్తి కోపం పెంచుకున్నాడు. ఏడేళ్ల వయసులో జరిగిన అవమానానికి 30 ఏళ్ల తర్వాత ప్రతీకారం తీర్చుకున్నాడు. 1990లో తన ఏడేళ్ల వయస్సులో పాఠశాల విద్యార్థిగా ఉన్న సమయంలో టీచర్ మారియా వెర్లిండెన్ తన గురించి చేసిన వ్యాఖ్యలను అతను మరిచిపోలేదు.
స్కూల్లో అవమానించిన టీచర్‌పై ఓ వ్యక్తి కోపం పెంచుకున్నాడు. ఏడేళ్ల వయసులో జరిగిన అవమానానికి 30 ఏళ్ల తర్వాత ప్రతీకారం తీర్చుకున్నాడు. 1990లో తన ఏడేళ్ల వయస్సులో పాఠశాల విద్యార్థిగా ఉన్న సమయంలో టీచర్ మారియా వెర్లిండెన్ తన గురించి చేసిన వ్యాఖ్యలను అతను మరిచిపోలేదు. ఉవెంట్స్ అనే 37 ఏళ్ల వ్యక్తి 2020లో టీచర్‌ను హత్య చేశాడు. ఏకంగా 101 సార్లు కత్తితో పొడిచి చంపాడు. ఈ ఘోర ఘటన బెల్జియంలో చోటుచేసుకుంది. అయితే హత్య జరిగిన 16 నెలల తర్వాత, ఉవెంట్స్ టీచర్‌ను హత్య చేసిన విషయం తన స్నేహితుడి దగ్గర చర్చించాడు. దీంతో అతను పోలీసులకు సమాచారం ఇచ్చారు. అనంతరం ఉవెంట్స్‌ను ఆదివారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హత్య జరిగిన ప్రదేశంలో లభించిన క్లూతో నిందితుడి డీఎన్‌ఏను పరీక్షించగా అతనే నేరం చేసినట్లు తేలింది. అంతేగాక నిందితుడు హతురాలి పూర్వ విద్యార్ధి అని తేలింది. తనను అవమానించినందుకే టీచర్‌ను హత్య చేసినట్లు పోలీసుల ఎదుట అంగీకరించాడు.
మరిన్ని చూడండి ఇక్కడ:
Viral Video: బస్‌స్టాప్‌లో అదేం పని రా బాబు.! సోషల్ మీడియాలో వీడియో వైరల్.!
viral Video: ఇంటి అద్దె కట్టలేక ఆఫీసులోనే మకాం పెట్టేసాడు.. తర్వాత ఏమైందంటే..?
NTR-Ram Charan-RRR: ఒకరు మన్యం ధీరుడు.. మరొకరు గిరిజన వీరుడు.. రామ్ భీమ్‌ల మధ్య స్నేహం..