ముఖేష్ అంబానీ లిస్ట్‌లో మరో విలాసవంతమైన ఇల్లు.. ఎంతకు కొన్నారంటే..!
ప్రపంచ కుబేరుడు.. ప్రముఖ పారిశ్రామిక వేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ కొంత కాలంగా విదేశాల్లో విస్తృతంగా ఆస్తుల్ని కొనుగోలు చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన అమెరికాలో మరో విలాసవంతమైన భవంతిని సొంతం చేసుకున్నారు. న్యూయార్క్ లోని ప్రఖ్యాత ట్రైబెకా ప్రాంతంలో ఉన్న భవంతిని 17.4 మిలియన్ డాలర్లు అంటే సుమారు రూ.145 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసినట్టు 'ద రియల్ డీల్' నివేదిక వెల్లడించింది.
ఈ లగ్జరీ రెసిడెన్షియల్ ప్రాపర్టీని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అమెరికా విభాగం కొనుగోలు చేసినట్లు సమాచారం. ఈ భవంతిని టెక్ బిలియనీర్ రాబర్ట్ పెరా 2018లో దాదాపు 20 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేసి, లగ్జరీ హోమ్‌గా అభివృద్ధి చేయాలని భావించారు. కానీ ఆ ప్రణాళికలు కార్యరూపం దాల్చకపోవడంతో 2021లో ఆయన దాన్ని 25 మిలియన్ డాలర్లకు విక్రయానికి పెట్టారు. తాజాగా, ముకేశ్ అంబానీ కుటుంబం ఈ భవంతిని సొంతం చేసుకుంది. ఇక్కడ మరో విషయం ఏమిటంటే.. ముకేశ్ అంబానీ 2023 ఆగస్టులో మాన్‌హాటన్‌లో హడ్సన్ నదికి ఎదురుగా ఉన్న 9 మిలియన్ డాలర్ల విల్లాను విక్రయించారు. దానికి కేవలం రెండేళ్ల వ్యవధిలోనే ఈ కొత్త ఇంటిని కొనుగోలు చేయడం విశేషం. ఇటీవల విదేశాల్లోనూ అంబానీ పెద్ద పెద్ద డీల్స్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే అక్కడ కూడా ఇళ్లు, ఆఫీసులు ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. గతంలో సింగపూర్‌లో భారీ మొత్తం వెచ్చించి.. ఒక ఫ్యామిలీ ఆఫీస్ ఏర్పాటు చేసినట్లు వార్తలు వచ్చాయి. తర్వాత అమెరికా, లండన్, దుబాయ్‌లోనూ భారీ బంగళాలు కొనుగోలు చేశారని వార్తలు వచ్చాయి. కాగా, బ్లూంబర్గ్ బిలియనీర్ల ఇండెక్స్ ప్రకారం.. ప్రస్తుతం ముకేశ్ అంబానీ నికర ఆస్తులు 97.9 బిలియన్ డాలర్లు అంటే సుమారు రూ.8.2 లక్షల కోట్లు. దీంతో భారతదేశంలో అగ్రస్థానం, ప్రపంచవ్యాప్తంగా 18వ స్థానంలో కొనసాగుతున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
లీవ్ కావాలని ఎండీకి మెసేస్ పెట్టిన ఎంప్లాయ్.. మరు క్షణంలోనే
చంద్రుడి పైకి మీ బోర్డింగ్ పాస్! అవకాశం మిస్ కాకండి
బాబోయ్.. రోడ్డుపై భారీ పైథాన్… ఆ తర్వాత జరిగిందిదే
భోపాల్ ‘90 డిగ్రీల’ వంతెనకు పోటీగా నాగ్‌పూర్ ‘బాల్కనీ ఫ్లైఓవర్’
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

